బ్రేకింగ్ న్యూస్..టీ కాంగ్రెస్ కదిలింది..

బ్రేకింగ్ న్యూస్..టీ కాంగ్రెస్ కదిలింది..

ఏదైతేనేం…మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాస్త జూలు విదిల్చినట్టే కనిపిస్తున్నారు.ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళానికి వ్యతిరేకంగా ఇటు ఇంటర్ బోర్డు ఎదుటా,అటు కలెక్టరేట్ల ముందూ భారీ ధర్నాలకు ప్లాన్ చేశారు.మేమింకా ఉన్నాం అంటూ తెలంగాణ ప్రజలకు గుర్తు చేశారు.ప్రజా ఉద్యమాలను నిర్మించడంలోనూ,టీఆర్ఎస్ సర్కారు విధానాల మీద దూకుడునూ ప్రదర్శించడంలోనూ కాంగ్రెస్ చురుకుగా కదలడం లేదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.ఎట్టకేలకూ ఇంటర్ విద్యార్థుల సమస్య మీద ఆ పార్టీ నాయకులు సమష్టిగా స్పందించారు.మరోవైపు టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన నాయకులంతా గవర్నర్‌ను కలిశారు. ప్రజా వ్యతిరేక విధానాలకూ,అనైతిక రాజకీయాలకూ పాల్పడుతున్నందున తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.తన అస్తాన్ని బయటకు తీయాలని గవర్నర్ కు విన్నవించుకున్నారు.ఆయనా అదే రీతిలోనే సమాధానం చెప్పారనుకోండి.అది వేరే సంగతి.కాంగ్రెస్ నాయకులంతా సమష్టిగా కదలడమే ఇక్కడ చెప్పుకోదగిన విషయం.

అప్పుడే ప్రజలకు మేలు

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బలంగా ఉంటే,విపక్షం కూడా అంతే బలంగా ఉండాలి.అప్పుడే ప్రజలకు మేలు కలుగుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.లేకపోతే తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవే సరియైనవని పాలకులు భావించే ప్రమాదం ఉందని అంటున్నారు.విపక్షం గట్టిగా ఉంటే సర్కారు నిర్ణయాల మీద మంచి,చెడులను ఎత్తి చూపే అవకాశం ఉందని అంటున్నారు.పాలకులూ కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.కమ్యూనిస్టులు ఒకప్పుడు ప్రజా ఉద్యమాలను బలంగా నిర్మించేవారు.జనాన్ని ఎలాంటి పోరాటాలకు అయినా సిద్ధం చేసేవారు.ఇప్పడు వారు కూడా నీరసించిపోయారు.తమ ఉనికిని చాటుకోవడానికే తంటాలు పడుతున్నారు.ఇదే పాలకులకు కలిసి వస్తోంది.మొత్తానికి కాంగ్రెస్ ఇప్పుడు వేసిన అడుగు కొనసాగిస్తుందా? నాయకులంతా కలసికట్టుగా భవిఫ్యత్తులోనూ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *