టీమిండియా న్యూ లుక్..అదిరింది!

టీమిండియా న్యూ లుక్..అదిరింది!

టీమిండియా ప్లేయ‌ర్లు వ‌ల్డ్‌క‌ప్‌లో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీలో క‌నిపించ‌నున్నారు. అయితే ఆ జెర్సీ వేసుకున్న కోహ్లీ సేన వీడియో రిలీజ్ అయింది. ఆరెంజ్ జెర్సీలో టీమిండియా ప్లేయ‌ర్లు డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నారు. బీసీసీఐ శుక్రవారం అధికారికంగా ఈ డ్రెస్సును రిలీజ్ చేసింది.

ఫిఫా టోర్నీల తరహాలో గతానికి భిన్నంగా ఈసారి రెండు జెర్సీల ఫార్మాట్‌ను తీసుకొచ్చింది ఐసీసీ. హో టీమ్ ఇంగ్లండ్ మినహా అన్ని జట్లు వేర్వేరు రంగుల్లో జెర్సీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. జెర్సీలు దాదాపు ఒకే రంగులో ఉండటం వలన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీసేన కొత్త అవతారంలో బరిలోకి దిగుతున్నది. ఇన్నాళ్లు నీలి రంగుకు అలవాటు పడ్డ అభిమానులకు టీమ్‌ఇండియా అదిరేటి ఆరెంజ్ జెర్సీలో అలరించనుంది.

చాహల్, షమీ, రాహుల్ కొత్త జెర్సీలు ధరించి ఫొటోలను సోషల్‌మీడియాలో అభిమానుల కోసం షేర్ చేశారు.
అందరూ అనుకున్నట్లుగానే నారింజ, నీలి రంగు కాంబినేషన్‌లో కొత్త డ్రెస్ అదిరిపోయేలా కనిపిస్తున్నది. జట్టు అధికారిక స్పాన్సర్ నైకీ సంస్థ అత్యుత్తమ శ్రేణిలో జెర్సీకి రూపకల్పన చేసింది. ఆటగాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా డ్రెస్‌ను డిజైన్ చేశారు. తేలికపాటిగా, శరీరంపై చెమట త్వరగా ఆరిపోయేలా సౌకర్యవంతంగా జెర్సీని మలిచారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *