చంద్రబాబుని పొగిడి వైసీపీలోకి జంప్‌ అయ్యాడు

చంద్రబాబుని పొగిడి  వైసీపీలోకి జంప్‌ అయ్యాడు

సీమాంధ్రలో రాజకీయ వాతావరణం వేడేక్కింది. ఊహించిన పరిణామాలతో పాటు ఊహించని పరిణామాలూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అదునుచూసి పార్టీ జంప్‌ అయ్యేవాళ్లూ దీన్నే భలే మంచి సమయం అనుకుంటున్నారు. అందరూ ఒకలా పార్టీ జంప్‌ అయితే మాగంటి మాత్రం కాస్త డిఫ్రెంట్‌ రూట్‌లో వెళ్లాడు. కండువా రంగు మార్చేవాళ్లంతా… అప్పటివరకూ ఉన్న పార్టీపై విమర్శలు గుప్పించి, కొత్తపార్టీని తెగ పొగిడేస్తుంటారు. మాగంటి మాత్రం అప్పటివరకూ కొనసాగిన టీడీపీని పొగిడి మరీ వైసీపీలోకి జంప్‌ అయ్యాడు.

37 ఏళ్ల అనుబంధం…

ఉన్న కొద్దిపాటి అనుమానాలనూ తెరదించుతూ… రాజీనామా విషయంపై టీడీపీకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి క్లారిటీ ఇచ్చేశాడు. అనుచరులతో మాటామంతీ జరిపిన అనంతరం వైసీపీలోకి చేరనున్నట్టు ప్రకటన ఇచ్చాడు. చంద్రబాబుపై తనకెలాంటి ఇబ్బందులూ లేవనీ, వైసీపీతో ఉన్న అనుబంధం వల్లే పార్టీ మారుతున్నాడనీ తెలిపాడు. బాబుతో తనకు 37 ఏళ్ల అనుబంధం ఉందనీ, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేననీ అన్నాడు. టీడీపీలో ఉన్నంత కాలం చంద్రబాబు పూర్తి సహాయసహకారాలు అందిచారని అన్నాడు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాడని బాబు గురించి పాజిటివ్‌గా మాట్లాడాడు. పార్టీ మారుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో దాదాపు చాలా మంది షాక్‌ అయిపోయారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *