వాస్తవాలు తెలియక..!? మితిమీరిన ఆత్మవిశ్వసమా!? : "దేశం" అతర్మథనం

వాస్తవాలు తెలియక..!? మితిమీరిన ఆత్మవిశ్వసమా!? : "దేశం" అతర్మథనం

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైనా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం ప్రారంభమయ్యింది. దారుణ పరాజయం పాలైన తర్వాత “ప్రజలను ఇంత కష్టపెట్టామా”అని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో జరిగిన తెలుగుదేశం అభర్థుల సమావేశంలో మాట్లాడుతూ “గతంలోనూ ఓటమి పాలైయ్యామూ… అప్పుడు కారణాలు స్పష్టంగా తెలిశాయి. ఈనాటి ఓటమికి మాత్రం కారణాలు తెలియడం లేదు.” అని అన్నారు. ఎన్నికలలో ఓటమి పాలు కావడం కంటే ప్రతిపక్ష వైఎస్.ఆర్. పార్టీ నుంచి ఎంత మంది ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకున్నారో అంత మందే విజయం సాధించడం చంద్రబాబు నాయుడుకు మింగుడుపడడం లేదని అంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు.. పార్టీ నాయకులు ఎవ్వరూ క్షేత్ర స్దాయిలో పరిస్థితులను వివరించలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఆశోక్ గజపతి రాజు ప్రస్తావించారు. “అంతా బాగుంది… ఆల్ ఈజ్ వెల్” అన్నట్లుగా పార్టీ నాయకులు వ్యవహరించారని, అదే ఇప్పుడు కొంప ముంచిందని తీర్మానిస్తున్నారు.”

లోకల్‌కే ప్రాధాన్యం!
ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయడంతో పాటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పదే పదే కించపరుస్తూ ప్రకటనలు చేయడం కూడా పార్టీ ఓటమికి కారణంగా అంచనా వేస్తున్నారు. ఎన్నికలలో పార్టీ విజయం సాధించడం ఖాయం అనే ధీమా పార్టీ నాయకులలో వ్యక్తం అయ్యిందని, ఆ ధీమాతోనే ప్రజలలోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుని వెళ్లలేదని, పార్టీ ఓటమికి ఇది కూడా ఓ కారణమని పార్టీ సీనియర్ నేతలు నిర్ధారిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వడం కంటే ఆయన చేసే ప్రతీ తప్పును ప్రజలలోకి తీసుకుని వెళ్లాలని, రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కునేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ముందు ముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడంపై శ్రద్ద పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *