యాక్టర్‌ సంధ్య దారుణ హత్య

యాక్టర్‌ సంధ్య దారుణ హత్య
మహిళల జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాలం ఎంత మారుతున్నా ఇప్పటికీ ఎన్నో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. యాసిడ్‌ దాడులకూ, కత్తివేట్లకూ, అత్యాచారాలకూ గురవుతున్నారు. కుటుంబాల్లోని మనస్పర్దలకూ ఆడవాళ్లే బలవుతన్నారు. సినిమాలో సన్నివేశాల దగ్గర నుండీ నిజ జీవితంలోని సంఘటనల వరకూ అవే దారుణాలు కనిపిస్తున్నాయి. గృహిణులూ, ఉద్యోగస్తులూ, సినిమా యాక్టర్లూ, విద్యార్థలూ ఎవరూ ఈ చట్రం నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ఈ పురుషాధిక్యపు కోటలో మహిళల మానసాలకూ, శరీరాలకే గాయలవుతున్నాయి. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తమిళ నటి సంధ్యను కూడా అలానే ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది. అనుమానంతో తన భర్తే అత్యంత దారుణంగా హత్య చేశాడు.  
 
Tamil Actress sandhya murder

ముక్కలుమక్కలుగా నరికాడు… 

నటి సంధ్య తమిళ ఇండస్ట్రీలో స్థిర పడింది. చిన్నచిన్న పాత్రలు వేస్తూ నిలదొక్కుకుంది. ఇండస్ట్రీలోనే సహాయ దర్శకుడిగా చేస్తున్న బాలకృష్ణన్‌ను పెళ్లి చేసుకుంది.  చెన్నైలోని జఫర్‌ఖాన్‌పెట్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలతో కుటుంబం ఆనందంగా గడుస్తోంది. కొద్దిరోజుల క్రితం నుంచీ అకస్మాత్తుగా సంధ్య మాయమైంది. దీనిపై బాలకృష్ణన్‌ ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. జనవరి 21న పళ్లికరనైయ్ డంపింగ్ యార్డ్‌లో గుర్తుతెలియని ఓ మహిళకు చెందిన కాళ్లు, చేయి బయటపడ్డాయి. అవి ఎవరివో తెలుసుకునేందుకు పోలీసులు చాలా ప్రయత్నం చేశారు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. సంధ్య కనిపించకపోయినా ఫిర్యాదు చెయ్యని బాలకృష్ణన్‌పై పోలీసులకు అనుమానం మొదలైంది. దీంతో మంగళవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే హత్య చేసినట్టు బాలకృష్ణన్‌ ఒప్పుకున్నాడు. సంధ్య రాత్రి సమయాల్లో తరచుగా ఫోన్‌ మాట్లాడుతుందనీ, తనకు అక్రమ సంబంధాలున్నాయనీ అనుమానం ఉందనీ అందుకే హత్య చేశాననీ చెప్పాడు. ఈ పద్ధతి మార్చుకోమని ఎన్నోసార్లు వారించినా వినకపోవడంతో చంపేశానని చెప్పాడు.   
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *