ప్రాణాల మీదకు తెచ్చిన ఫోన్‌ చాటింగ్‌

ప్రాణాల మీదకు తెచ్చిన ఫోన్‌ చాటింగ్‌

సెల్‌ ఫోన్‌ చాటింగ్‌ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం రుక్మాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చెర్కుపల్లి రమేష్‌ అనే వ్యక్తి మంబాపూర్‌లో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నారు. ఆయన ఇటీవల బీజేపీ తరఫున సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. శుక్రవారం ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత గ్రామం వాట్సప్‌ గ్రూపులో చాటింగ్‌ ప్రారంభించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అసభ్యకర సందేశం పోస్టు చేశారు. దీనిపై రమేష్‌ స్పందిస్తూ మరో పోస్టు చేశారు. కొంత సేపు విమర్శలు కొనసాగిన తర్వాత చాటింగ్‌ నిలిపి వేసి మొబైల్‌లో అతనితో వాగ్వాదానికి దిగారు. అరగంట పాటు వాగ్వాదం కొనసాగింది. ఈ క్రమంలో రమేష్‌కు రక్తపోటు ఎక్కువై అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరుగుతున్నాయంటూ భార్య సంతోషిణితో చెప్పి స్పృహ తప్పిపడిపోయారు. వెంటనే ఆమె తాండూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అధిక రక్తపోటు కారణంగా మెదడులో నరాలు చిట్లి అప్పటికే రమేష్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *