ఖాలీజ్‌ఖాన్‌ దర్గా వద్ద రోడ్డు ప్రమాదం..లారీ దగ్ధం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలోని ఖాలీజ్‌ఖాన్‌ దర్గా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏషియన్‌ పేయింట్స్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.