బుచ్చిరెడ్డిపాలెం హైవేపై ఘోర ప్రమాదం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్‌ను..సిమెంటు కాంక్రీట్‌ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.

రెండు లారీలు ఢీ..క్లీనర్ మృతి

గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో రెండు లారీలు తగలబడటంతో సంగం డైయిరీ లారీ క్లీనర్ కొండారెడ్డి మృతి చెందాడు.…

ఖాలీజ్‌ఖాన్‌ దర్గా వద్ద రోడ్డు ప్రమాదం..లారీ దగ్ధం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలోని ఖాలీజ్‌ఖాన్‌ దర్గా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏషియన్‌ పేయింట్స్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ...మంటల్లో బూడిదైన లారీ,గోధుమలు

అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలోని NH 44 జాతీయరహాదారిపై ఒక లారీ దగ్ధమైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి బెంగుళూరుకు గోధుమల లోడుతో వెళ్తున్నలారీ డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమయ్యింది.