నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం హోదాలో వైఎస్ జగన్‌ నేడు మొదటిసారిగా కడప జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జమ్మలమడుగులో రైతు దినోత్సవ బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సీఎం…

ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఇసుక

కడప జిల్లా వల్లూరు మండలం పైడి కాల్వ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. క్వారీలో ఇసుక తవ్వకాలు జరపడంతో గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ ఆందోళనకు దిగారు.    

రైల్వే ట్రాక్ పై ప్రేమజంట ఆత్మహత్య

కడప జిల్లా గంగాయపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు అనంతపురం వన్‌ టౌన్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా రమేశ్.. అదే పట్టణానికి చెందిన ఓ యువతిగా పోలీసులు గర్తించారు.

తాగునీరు లేక కడపజిల్లా ప్రజల అవస్థలు

ట్యాంకర్లలో రెంటుకు నీళ్లను తెప్పించుకునే వాళ్లను చూసి ఉంటారు..టూ వీలర్లకు క్యాన్లు కట్టి కష్టపడేవారిని కని ఉంటారు. కానీ కడప జిల్లాలో నీళ్లను మోసుకెళ్లడం కోసం పెద్ద సాహసమే చేస్తున్నారు ఓ గ్రామస్థులు. వేలకు వేలు ఖర్చు చేసి పానిపట్టు యుద్ధం…