భార్యను దారుణంగా చంపిన భర్త

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వి.కోట మండలం దాసార్లపల్లిలో భార్యపై అనుమానంతో భర్త శ్రీనివాస్‌ గడ్డపారతో అతికిరాతకంగా పొడించి హత్య చేశారు. దీంతో భార్య వసంత అక్కడికక్కడే మృతిచెందింది. హత్య అనంతరం శ్రీనివాస్‌ పోలీసులకు లొంగిపోయాడు.

రోడ్డుపై పసికందు తలను పడేసిన దుండగులు

ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఆదిలాబాద్‌ పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో పసికందు తల తెగిపడిన ఘటన కలకలం రేపుతోంది. రోడ్డుపై పసికందు తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పసికందును నరికి తల.. మొండెం వేరువేరుగా పడేసినట్లు…