బయటపడిన బ్రిటీష్‌ కాలం నాటి తుపాకులు

తూర్పుగోదావరి జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి తుపాకులు బయటపడ్డాయి. కాకినాడలోని విద్యుత్‌ నగర్‌లో ఓ భవనం నిర్మించేందుకు పిల్లర్ల కోసం భూమిని తవ్వతుండగా.. శిథిలమైన పది తపాకులు బయటపడ్డాయి. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.  

శ్రీకాకుళం లో కూలిన మూడంతస్థుల భవనం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం వద్ద పెను ప్రమాదం తప్పింది.మూడు అంతస్తులు భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.భవనం కూలడానికి కొద్దిక్షణాల ముందే..శబ్ధం రావడంతో…సమీపంలోని ప్రజలు దూరంగా పరుగెత్తారు.దీంతో ప్రాణనష్టం తప్పింది.