'గేమ్ ఓవర్' తాప్సీ సినీజీవితంలో ఒక గేమ్ ఛేంజర్

'గేమ్ ఓవర్' తాప్సీ సినీజీవితంలో ఒక గేమ్ ఛేంజర్

తాప్సీ పొన్ను. తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో పరిచయం అయిన భామ. టాలివ్వుడ్‌తో సినిమా కెరీర్‌ను మొదలుపెట్టిన తాప్సీ…తక్కువ సమయంలోనే హిందీ సినిమాల్లో అడుగుపెట్టింది. తెలుగు సినిమాల్లో లాగా గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. మూడేళ్ల క్రితం పింక్ అనే చిత్రంతో తన నటనా విశ్వరూపమెంటో చూపించింది. ఈ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపుని సాధించుకుంది.

ఇదే క్రమంలో విభిన్న పాత్రలను చేస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’ అనే మరో భిన్నమైన కథను ఎంచుకుంది. ఈ సినిమా ఈరోజే విడుదలైంది. నయనతారతో ‘మయూరి’ సినిమాను తీసిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాను తెరకెక్కించారు. వై నాట్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్నారు. రోన్ ఏహాన్ సంగీతం సమకూర్చారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తాప్సీ నటనకు ఫిదా అయిపోయారు. ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. సినిమా మొదలైన మొదటి షో నుంచే ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ నడుస్తోంది.

సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. గడిచిన పదేళ్లలో తాను చూసిన బెస్ట్ థ్రిల్లర్ అని కితాబిచ్చేస్తున్నారు. ఇక తాప్సీ నటన అయితే అద్భుతమని… ఆమెకు నేషనల్ అవార్డు రిజర్వ్ అయిపోయిందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. అశ్విన్ శరవణన్ రాసుకున్న కథ, దాన్ని తెరపై చూపించిన విధానం అద్భుతంగా ఉందనీ మొదటి షో నుంచే ఈ రకమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద సినిమా అయితే ఒక మాస్టర్ పీస్ అని పొగిడేస్తున్నారు. ఇంత మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోన్న ‘గేమ్ ఓవర్’.. బాక్సాఫీసు వద్ద ఎంతమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి!

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *