సైరా నరసింహారెడ్డికి వరుసగా అడ్డంకులు

సైరా నరసింహారెడ్డికి  వరుసగా అడ్డంకులు

సైరా నరసింహారెడ్డికి ఏమయ్యింది. ఆ సినిమాకు షూటింగ్‌కు వరసగా ఎందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ఆటంకాలు యాదృచ్ఛికమా… లేక సైరా నరసింహారెడ్డి శాపమా? నరసింహారెడ్డిని బ్రిటిష్‌వాళ్ల చంపేసి… ఆయన తలను ఉయ్యాలవాడ కోటకు వేలాడదీశారు. దాన్ని అలాగే వదిలేశారు చాలా సంవత్సరాలు. దీంతో సైరా నరసింహారెడ్డి ఆత్మ శాంతించలేదని కొందరు అంటున్నారు. అందుకే సైరా సినిమాకు వరుసగా అడ్డంకులు వస్తున్నాయని మరికొందరు చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ‘సైరా’ నరసింహా రెడ్డి. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. అయితే అనుకోని అవాంతరాలతో చిత్రసీమ అప్‌సెట్‌ అవుతోందది. తాజాగా… ఈ సినిమాలో నటిస్తున్న విదేశీ నటుడు అలెగ్జాండర్‌కు వడదెబ్బ తగలడంతో తీవ్ర గుండెనొప్పితో మరణించారు. 38 ఏళ్ల అలెగ్జాండర్ సైరా చిత్రంలో బ్రిటీషియర్‌గా నటిస్తున్నారు. ఈ పాత్రకోసం భారీ ఎత్తున ఆడిషన్స్ నిర్వహించగా.. రష్యా పౌరుడైన అలెగ్జాండర్ ఈ చిత్రంలో బ్రిటీషియర్ పాత్రకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోస్ చివరి షెడ్యూల్ జరుగుతుండగా.. రెండు నెలల క్రితం రష్యా నుంచి ఆరునెలల విజిటింగ్ వీసాపై ఇండియాకి వచ్చారు అలెగ్జాండర్. ప్రస్తుతం గచ్చిబౌలీలో నివాసం ఉంటున్న ఆయన.. వడదెబ్బ కారణంగా మృత్యువాత పడ్డాడు. గచ్చిబౌలి గేట్ నెంబర్ 1 వద్ద సొమ్మసిల్లి పడిపోయిన ఆయన్ని పోలీసుల సాయంతో స్థానికులు కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన తీవ్ర గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో మరణించారు. ఆయన వద్ద లభించిన వస్తువులు ఫొటోల ఆధారంగా వివరాలను సేకరించిన పోలీసులు అలెంగ్జాండర్ ‘సైరా’ సినిమా షూటింగ్ కోసం ఇండియా వచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో చేల్చి బంధువులకు సమాచారం అందించారు.

గతంలో…. సైరా సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని కోకాపేటలో చిరంజీవి పొలంలో ఈ సినిమా కోసం కోట సెట్‌ వేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోటపై దండెత్తి రావడం, కోటలో యుద్ధం చేయడం వంటి సన్నివేశాల చిత్రీకరణ కోసం ఈ సెట్‌ వేశారు. ఇరవై రోజులుగా ఇదే సెట్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సెట్‌ కాలిపోయింది. దీంతో షూటింగ్‌కు అంతరాయం కలిగింది.

మరోవైపు – కర్ణాటక రాష్ట్రం బీదర్‌లోనూ సినిమా షూటింగ్‌కు తీవ్ర అడ్డంకులు ఎదురయ్యాయి. చిత్రీకరణకు నిరసనగా స్థానికులు ధర్నాకు దిగారు. మసీదు ప్రాంగణంలో హిందూ దేవతా మూర్తులను ఉంచి చిత్రీకరణ జరుపుతుండడం తమ ధార్మిక భావాలను దెబ్బతీస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి ఉద్దేశ్యం తమకు లేదని చారిత్రక సినిమా కావడం వల్ల సహజత్వం కోసం దేవతామూర్తులను ఉంచామని షూటింగ్‌ అనంతరం తీసివేస్తామని ఎంతగా నచ్చచెప్పినా ముస్లింలు అంగీకరించలేదు. ఈ ఘటన అనంతరం చిత్రీకరణను అర్ధంతరంగా ముగించి చిత్ర యూనిట్‌సభ్యులు వెళ్లిపోయారు.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ తేజ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి పోషిస్తున్నారు. అమితాబ్ కీలకపాత్రలో నటిస్తుండగా.. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *