'సైరా' రిలీజ్ కు స్పెషల్ డేట్ !

'సైరా' రిలీజ్ కు స్పెషల్ డేట్ !

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు . భారీ బడ్జెట్‌తో చాలా ప్రేస్టేజియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని… ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కొణిదేల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డిని కూడా అందుకు తగ్గట్టు హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్నారు. ఈ సినిమాలో నయనతార, సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్లు నటిస్తున్నారు. అందుకే ఈ మూవీ కోసం హిందీ, కన్నడ ,తమిళ ప్రేక్షకులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారట. భారీ అచంనాలతో రాబోతున్న సైరా ఆడియన్స్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి మరి..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *