జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న సైరా

జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న సైరా

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి… తెల్లదొరలపై చివరి రక్తపు వరకు పోరాటం చేసి ప్రాణాలు వదిలిన వీరుడు.. బ్రిటిషర్లని భయపెట్టిన పోరాట యోధుడు… అంతటి గొప్ప చరిత్ర ఉన్న ఉయ్యాలవాడ జీవితాన్ని తెరపై చూపించబోతున్నారు. మెగాస్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు లుక్ చాలా స్పెషల్ గా డిజైన్ చేసారు. భారీ పోరాట ఘట్టాలతో ఉండే సైరా సినిమా రేంజ్ ని చూపించడానికి ఇటీవలే ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు.

Sye Raa Narasimha Reddy

పొగరుని…

ఈ  యుద్ధం ఎవరిదీ అంటూ చిరు చెప్పిన డైలాగ్ కి, టీజర్ లో వచ్చిన సన్నివేశాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఉయ్యాలవాడ చిరు… కళ్ళతోనే ఒక వీరుడికి ఉండే పొగరుని, ఆ గర్వాన్ని అద్భుతంగా చూపించాడు. ఇండియన్ స్టార్స్ అందరూ కలిసి నటిస్తున్న సైరా సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఆ వీరుడి మరణం…

రీసెంట్ గా జార్జియా వెళ్లిన చిత్ర యూనిట్.. అక్కడ రెండు వార్ సీన్స్ తో పాటు, క్లైమాక్స్ లో వచ్చే భారీ పోరాట సన్నివేశాన్ని కూడా తెరక్కించారని సమాచారం. ఇదిలా ఉంటే అసలు కథ ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని  చంపిన బ్రిటిషర్లు, ఆయన తలని కోయిలకుంట్ల కోటికి ముప్పై ఏళ్ళ పాటు వేలాడ దీశారు. సైరా క్లైమాక్స్ లో ఇది చూపిస్తే సినిమా చూసి బయటకి వచ్చే అభిమానులు కొంత నీరస పడే అవకాశం ఉండడంతో.. క్లైమాక్స్ లో మార్పులు చేస్తున్నారట.. కానీ నిజానికి ఉయ్యాలవాడ కథలో గొప్పదనమే… ఆ వీర మరణం, ఎందరో పోరాట యోధులకి స్ఫూర్తి నిచ్చిన ఆ వీరుడి మరణం చూపిస్తేనే.. అతనికి ఘనమైన నివాళి ఇచ్చినట్లు అవుతుంది… మరి ఇటీవలే వినిపిస్తున్న వార్తలని బేస్ చేసుకొని సైరా క్లైమాక్స్ మారుస్తారా? లేక చరిత్రని అలానే చూపిస్తారా అనేది చూడాలి.

 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *