మరోసారి వెనక్కి వెళ్లిన సైరా

మరోసారి వెనక్కి వెళ్లిన సైరా

`సైరా నరసింహారెడ్డి` రిలీజ్ పై మరోసారి అనుమానాలు వస్తున్నాయా? విఎఫ్ ఎక్స్ టీమ్ చేసిన పనికి సైరా వాయిదా తప్పదా? సైరా విడుదల అక్టోబర్ 2 ..2020 సంక్రాంతికి చేరిందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే….

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, అనుష్క, తమన్నా, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి… అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బిగ్ బి అమితాబ్… ఇంతటి భారీ ఫేమ్ ఉన్న సెలెబ్రిటీస్ కలిసి చేస్తున్న సినిమా సైరా… ఎప్పుడో 2017లో మొదలైన ఈ సినిమా ఈపాటికి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని, విడుదల కావాల్సి ఉండగా… ఎదో ఒక అడ్డంకి కారణంగా సైరా వాయిదా పడుతూనే ఉంది… టీజర్ తో మెప్పించారు, కొన్ని రోజుల పాటు ఫ్యాన్స్ ని సంతోష పెట్టారు కానీ సైరా ప్రేక్షకుల ముందుకి ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితికి వెళ్లారు. ఇక షూటింగ్ వర్క్ అయిపోయిందా.. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ప్రేక్షకుల ముందుకి రావడమే లేట్ అనుకుంటున్నా సమయంలో అభిమానులని, సైరా సినిమా మళ్లీ నిరాశ పరిచేలా ఉంది.

షూటింగ్ ఆలస్యం కావడంతో… విఎఫ్ఎక్స్ టీమ్ రూపంలో సినిమా రిలీజ్ కు కష్టాలు వచ్చి పడ్డాయనే టాక్ వినిపిస్తోంది. నాలుగు నెలల సమయంలో విఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ పనులు పూర్తవ్వడం కష్టమని… మరో రెండు నెలలు సమయం ఇస్తే చేస్తాం? లేకపోతే ప్రాజెక్ట్ వదులుకుంటామని కరాఖండీగా చెప్పేసారట. ఈ కారణంగానే సైరా అక్టోబర్ నుంచి సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. సో అక్టోబర్ కైనా ప్రేక్షకుల ముందుకి వస్తున్న అనుకున్న సైరా మళ్లీ వాయిదా పడినట్లే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *