స్విట్జర్లాండ్‌: సమాన వేతనం,గౌరవం కోసం రోడ్డెక్కిన మహిళలు

స్విట్జర్లాండ్‌: సమాన వేతనం,గౌరవం కోసం రోడ్డెక్కిన మహిళలు

స్విట్జర్లాండ్‌లో మహిళలు రోడ్డెక్కారు. దాదాపు 28 ఏళ్ల క్రితం ఇదే అంశంపై రోడ్డెక్కిన మహిళలు మళ్లీ ఈ అంశంపైనే రోడ్డెక్కారు..ఇంతకీ ఏంటా..అంశం..వారి ఉద్యమ కల నెరవేరుతుందా..? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ.

స్‌లో మహిళలు ఉద్యమిస్తున్నారు. సమాన వేతనం, గౌరవం కోసం వారు రోడ్డెక్కారు. 1991లో దాదాపు ఐదు లక్షల మంది మహిళలు హక్కుల కోసం ఇదే విధంగా రోడ్డెక్కారు. మళ్లీ 28 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా ఉద్యమిస్తున్నారు. లింగ సమానత్వం కోసం స్విస్ మహిళలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు.మొదటి ప్రపంచం యుద్ధం ముగిసిన తర్వాత 1918లో తమకూ ఓటు హక్కు కల్పించాలని లక్షలాదిగా మహిళలు స్విట్జర్లాండ్‌లో ఆందోళనలు నిర్వహించారు. కానీ, 1971 వరకు ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు లభించలేదు. చివరకు సుప్రీం కోర్ట్ సూచనతో ఓటుహక్కు కల్పించింది అప్పటి సర్కార్. 1991 ఉద్యమం చేసే సమయంలో స్విస్ ప్రభుత్వంలో మహిళలకు చోటు లేదు. ప్రసూతి సెలవుల ఊసే లేదు.

ఆ తర్వాత కొన్ని విషయాల్లో మార్పులు వచ్చాయి. ఉద్యమం కారణంగా ప్రసూతి సెలవుల కోసం ప్రత్యేకంగా చట్టం వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో 8 మంది మహిళలు మంత్రులుగా పనిచేశారు.కానీ, ఇప్పటికీ దేశంలో పురుషులతో పోల్చితే మహిళలు 20 శాతం తక్కువగా వేతనాలు అందుకుంటున్నారు. కీలక స్థాయి పదవుల్లో చాలా తక్కువ సంఖ్యలో మహిళలు ఉంటున్నారు.ఐఎల్‌వో గత నెలలో ఒక సర్వే నిర్వహించి స్త్రీ, పురుష వేతనాల వ్యత్యాసంలో స్విట్జర్లాండ్‌ చివరి స్థానంలో ఉంది.సమాన వేతనంపై మరింత పరిశీలన జరగాలని గతేడాది స్విస్ పార్లమెంట్ ప్రకటించింది. అప్పుడే సమ్మెకు దిగాలని మహిళా ఉద్యోగులు నిర్ణయించారు. అప్పటి నుంచి దేశంలోని మహిళలంతా ఏకమవుతూ సమ్మెకు సిద్ధమయ్యారు. ఇందుకు సోషల్ మీడియానూ వేదికగా చేసుకున్నారు.దేశంలోని ప్రధాన నగరాలైన బెర్న్, బసెల్, జ్యూరిచ్ తదితర ప్రాంతాల్లోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలందరూ ఒక చోట గుమిగూడి నినాదాలు ఇస్తున్నారు. జెనివాలో పురుషుల పేరుతో ఉన్న వీధులను చెరిపేసి మహిళల పేర్లు రాస్తున్నారు.

ఇకపై పనిలోకి వచ్చేది లేదని ఇప్పటికే వేలాది మంది మహిళా ఉద్యోగులు తమ బాస్‌లకు చెప్పారు. మరికొంత మంది త్వరలోనే సమ్మెలో పాల్గొనబోతున్నారు. మగవారితో పోల్చితే 20 శాతం తక్కువ వేతనం చెల్లిస్తున్న నేపథ్యంలో పని గంటలు కూడా 20 శాతానికి తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా మహిళల సమ్మెకు మద్దతు తెలిపింది అక్కడి రైల్వే శాఖ. సమ్మెకు గుర్తుగా టీ షర్ట్‌లను కూడా అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు చాలా మంది పురుషులు కూడా మహిళల సమ్మెకు మద్దతిస్తున్నారు. వారు సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా పిల్లలను చూసుకుంటున్నారు. వారి కోసం వంట కూడా చేస్తున్నారు.

ఏదేమైనా స్విస్ దేశం మహిళల నినాదాలతో మార్మోగుతోంది. మహిళల డిమాండ్లను అక్కడి ప్రభుత్వం ఎంతవరకు నెరవేరుస్తుందో వేచిచూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *