కొండాపూర్‌లో స్విగ్గీ కార్మికులు ఆందోళన

కొండాపూర్‌లో స్విగ్గీ కార్మికులు ఆందోళన

కొండాపూర్‌లో స్విగ్గీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. స్విగ్గీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. నాలుగు కిలోమీటర్లు లోపు దూరానికి 45 రూపాయిలు చెల్లించాలి కోరారు. ఆ కమిషన్ మొత్తానికి తగ్గించారని మండిపడ్డారు.ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు రావాల్సిన పేమెంట్ వచ్చేలా చూడాలన్నారు.

తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎండనక,వననక తిరుగుతూ వచ్చే డబ్బుతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు.కానీ ఎంత చదివిన సరైన ఉద్యొగం దొరకక డెలివిరి బాయ్ గా చేరితే అటు కంపెనీ లో గాని డెలివరీ ఇచ్చే హోటల్స్ గాని ,వినియోగదారులు తమని మనుషులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు రావలసిన పేమెంట్ న్యాయంగా సమయానికి వచ్చేవిదంగా కృషి చేయాలని కోరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *