ఈసారి బిగ్ బాస్ హోస్ట్‌గా సీనియర్!

ఈసారి బిగ్ బాస్ హోస్ట్‌గా సీనియర్!

టెలివిజన్ రంగంలోనే రియాల్టీ గెమ్ షోలో బాగా పాపులర్ అయిన గేమ్ షో బిగ్ బాస్. ఫారెన్ నుంచి వచ్చిన ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ అందరిలోనూ క్యూరిసిటీని క్రేయేట్ చేసింది. త్వరలోనే బిగ్ బాస్ సీజర్ త్రీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ గేమ్ షోకు హోస్ట్‌గా వ్యవహారించేది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి సీజన్ త్రీకి హోస్ట్ చేయబోయేది ఏవరో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.

ఇప్పటి వరకు టెలివిజన్ చరిత్రలోనే రియాల్టీ గెమ్ షోలో బాగా పాపులర్ గేమ్ షో బిగ్ బాస్. ఫారెన్ వచ్చిన ఈ రియాల్టీ షోకు ఇండియా వైజ్‌గా యమా క్రేజ్ ఏర్పడింది. అయితే తెలుగులో ఈ షో ఫస్ట్ సీజన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేశాడు. ఓ స్టార్ హీరో ఈ రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహారించడంతో బిగ్ బాస్‌కు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ గేమ్ షోని చూడానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు టీవిలకు హత్తుకునేవారు. ఫస్ట్ సీజర్‌కు ట్రెమాండస్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ సీజన్‌ తారాస్థాయికి చేరుకుంది.

కాస్త మాసాల ఎక్కువ అంటు వచ్చిన బిగ్ బాస్ సీజన్ టూకి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహారించాడు. అయితే సీజన్ వన్ తో పోల్చుకుంటే సీజన్ టులో నాని యాంకరింగ్ పై చాలా సార్లు చాలా విమర్శలు వచ్చాయి. ఈ షో ఎక్కువ రోజలు రావడం కూడా మరిన్ని విమర్శలకు దారితీసింది. అంతేకాదు నాని హోస్టింగ్ తీరు పై నెటిజన్లు కామెంట్స్ చేస్తే , ఆ కామెంట్స్ తట్టుకోలేక ఒపెన్‌గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. సీజన్ టూ అంత గజీబిజీగా ఉండడం, విన్నర్ విషయంలో కూడా తృప్తిగా లేకపోవడంతో సీజన్ టూపై నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి. అయితే సీజన్ టూలా నెగెటివ్ ఫీలింగ్స్ రిపీట్ కాకుండా సీజన్ త్రీని హోస్ట్‌ దగ్గర నుంచి కంటెస్టెంట్స్ వరకు పక్కా ప్లాన్‌తో నిర్వహించబోతున్నారు నిర్వాహకులు. జూలైలో నెలల్లో స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్‌ 3 హోస్ట్‌గా నాగార్జునని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *