డాక్టర్ల పిటిషన్‌ పై నేడు సుప్రీం విచారణ

డాక్టర్ల పిటిషన్‌ పై నేడు సుప్రీం విచారణ

దేశ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో పని చేస్తున్న డాక్టర్లకు రక్షణ, భద్రత కల్పించాలంటూ.. డాక్టర్లు వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. డాక్టర్ల తరఫున లాయర్‌ అలోక్‌ శ్రీవాస్తవ సోమవారం వెకేషన్‌ బెంచ్‌ వద్ద పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ డాక్టర్ల పై రోగి బంధువులు దాడి చేసిన నేపథ్యంలో.. ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. డాక్టర్లకు విధి నిర్వహణ సమయంలో రక్షణ కోరుతూ.. దేశ వ్యాప్తంగా డాక్టర్లు చేపట్టిన నిరసన నిన్న నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *