శబరిమల తీర్పుపై బహిరంగ విచారణ - సుప్రీంకోర్టు

శబరిమల తీర్పుపై బహిరంగ విచారణ - సుప్రీంకోర్టు

శబరిమల ఆలయ వివాదం ఇపుడపుడే ముగిసేలా లేదు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని సుప్రీమ్‌కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని పున:సమీక్షించాలని కోరుతూ 49 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రివ్యూ పిటిషన్ల మీద సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్త ఏడాది జనవరి 22న ఈ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని స్పష్టత ఇచ్చింది. కానీ, పాత తీర్పుపై స్టే ఇవ్వలేమని చెప్పడం గమనార్హం.

భక్తుల ఆందోళన!

సెప్టెంబర్ 28న అత్యున్నత న్యాయస్థానం శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల వారికి నుమతివ్వాలని…ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని 4:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన రోజు నుంచి భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వేల మంది నిరసనకారులు ర్యాలీలు జరిపారు. మాస పూజల కారణంగా అక్టోబర్ 17న ఆలయాన్ని తెరిచాక ఈ పరిస్థితులు మరింత ముదిరి ఉద్రిక్తంగా సాగుతున్నాయి. ఆలయం మళ్లీ తెరిచాక కొందరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వీరిని భక్తులు అడ్డుకున్నే సమయంలో ఆలయ ప్రాంగణంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుతో పాటు మరికొందరు రివ్యూ పిటిషన్ వేశారు. వీటిని అంగీకరించి న్యాయస్థానం విచారణ చేపట్టింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *