'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' టీజర్

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' టీజర్

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’, సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంచ్ చేసిన ఈ టీజర్లో సినిమా ప్లాట్ పాయింట్ ని రివీల్ చేశారు. ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేస్తున్న నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకరికి కాశ్మీర్ తీవ్రవాదుల నుండి ముప్పు ఏర్పడుతుంది. ఈ సమస్యను కమాండో అర్జున్ పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు.. అందులో ఆదికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ సినిమా అని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

Operation Goldfish Teaser

దేశభక్తి థీమ్ తెరకెక్కిన సినిమా కాబట్టి టీజర్ దాదాపు సీరియస్ గా సాగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫి కూడా సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లో కూడా దేశభక్తి పొంగిపోతోంది కాబట్టి కరెక్ట్ టైంకి వస్తున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా హిట్ అయ్యి ఆది కెరీర్ ని సెట్ చేస్తుందేమో చూడాలి. ఇక ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాతో తెలుగు తెరపై సాషా ఛత్రి మెరవనుంది. ఎయిర్టెల్ యాడ్ తో నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *