ఇదం జగత్ సినిమా రివ్యూ

ఇదం జగత్ సినిమా రివ్యూ

రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా డిఫరెంట్ జానర్‌లో సినిమాలు చేస్తు రూట్ మార్చి సుమంత్ వైవిధ్యమైన కథలని సెలక్ట్ చేసుకోని సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య  సుమంత్ చేసిన రెండు సినిమాలు కూడా థ్రిల్ల‌ర్ జానర్ మూవీస్ కావడం విశేషం. ఇక ఇదం జగత్

క‌థ విషయానికి వస్తే జాబ్ లేక ఖాళీగా ఉంటాడు సుమంత్‌. అయితే ఖాళీగా ఉండడంత  ఇష్టంలేక ఫ్రీ లాన్స్ రిపోర్ట‌ర్‌గా త‌న‌కు తానే వర్క్ చేస్తుంటాడు.  నైట్ టైంలో జ‌రిగే  రోడ్డు ప్ర‌మాదాల్ని కెమెరాతో రికార్డ్ చేసి, ఛాన‌ళ్ల‌కు అమ్ముకుంటాడు.  ఓసారి రోడ్డుపై జ‌రిగిన ఓ హత్య‌ని త‌న కెమెరాలో బంధిస్తాడు. ఆ ఫుటేజ్‌తో డ‌బ్బు సంపాదించాల‌నుకుంటాడు. అయితే..ఆ ఫుటేజీనే త‌న జీవితాన్ని మ‌లుపు తిప్పుతుంది. అసలు ఆ ఫుటేజీలో ఉన్న మ్యాటర్ ఎంటీ  అనేదే సినిమా స్టోరీ.

Sumanth and Anju Kurian

క్యారెక్ట‌రైజేష‌న్

కొత్త పాయింట్‌తో సినిమా తీసినా  అనుకున్న కథని స్ర్కీన్ పై ప్రాజెంట్ చేయడలో  విఫలం అయ్యాడు దర్శకుడు.. స్టోరీని మొదలు పెట్టిన విధానమే ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. సినిమాలో వచ్చే సీన్స్ అతికించిన్నట్లు ఉండడంతో స్ర్కీన్ ప్లే కూడా  కరెక్ట్‌గా రాసుకోలేకపోయాడు.మ‌ర్డ‌ర్ జ‌రిగిన ఫుటేజీ చుట్టూనే సెకండాప్‌ మొత్తం న‌డిపించాడు ద‌ర్శ‌కుడు.  క‌నీసం  హీరో క్యారెక్ట‌రైజేష‌న్  కూడా సరిగ్గ డిజైన్ చేసుకోలేకపోయ్యాడు.

ఛాలెంజింగ్‌ రోల్ ఈ సినిమాలో  లేకపోవడంతో  ఇందులో నటినటులందు చాలా ఈజీగా  నటించారు.. హీరో సుమంత్‌కు ఇది కొత్త త‌ర‌హా  క్యారెక్టర్. టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్నా  క్యారెక్టర్‌లో నటించి మెప్పించాడు. హీరోయిన్  అంజుకురియన్‌ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికి ఉన్నంతలో బాగా చేసింది. గ్లామర్ పరంగా కూడా  బాగానే ఆకట్టుకుంది. మిగత నటినటులు తమ పరిధిమేర నటించారు.

idam jagath review

టూ డిఫరెంట్ షేడ్స్

ఈ సినిమా కథలో  విషయం ఉన్న అనుకున్న పాయింట్‌ని నిల‌బెట్టలేకపోయాడు దర్శకుడు. క‌థ‌, క‌థ‌నాలు రెండూ కూడా న‌త్త‌న‌డ‌క సాగాయి.దీంతో ప్రేక్షకుడికి చాలా బోరింగ్‌ కొడుతుంది. సాంగ్స్ , బ్యాగ్ గ్రౌండ్ స్కోర్  సినిమాకు మెయిన్  మైనస్ పాయింట్. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రగానే ఉన్నాయి.ఈ సినిమాతో సుమంత్ మళ్లీ బ్యాక్‌కు వెళ్ళాడు. మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏసిలో నిద్రపోవాలనుకునేవాళ్లు ఇదం జగత్ టిక్కెట్టు కొనుక్కోవాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *