హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..

హైదరాబాద్‌ మహానగరం భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. నిన్నామొన్నటి వరకు ఉక్కిరిబిక్కిరైన ప్రాంతాలన్నీ ఈ వర్షం దెబ్బతో ఒక్కసారిగా జలమయంగా మారాయి. పంజాగుట్ట, అమీర్‌పేట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ సహా చాలా చోట్ల జోరు వర్షం కురిసింది. దీంతో.. రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ పెరిగిపోయి వాహనదారులుమరోవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. నేరేడ్‌మెట్‌ డిఫెన్స్‌ కాలనీలో ఈదురుగాలులకు చెట్టు విరిగి మీద పడటంతో కారు ధ్వంసమైంది. పలు చోట్ల రోడ్లపై వర్షపు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం కారణంగా జీహెచ్ఎంసీ అలెర్ట్ అయింది. అప్రమత్తంగా ఉండాలంటూ ఎమర్జెన్సీ బృందాలు, డీఆర్‌ఎఫ్ టీమ్‌లను జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు ఆదేశించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *