ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు బదిలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణలో ఐజీగా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పని చేస్తున్నారు. కర్తవ్య నిర్వహణలో అత్యంత సమర్థుడిగా స్టీఫెన్‌కు పేరుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ కావడానికి మరో 15 రోజులు సమయంపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై కేంద్రానికి లేఖ రాసిన తర్వాత .. పూర్తిస్థాయిలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌‌గా పని చేయడంతో పాటు.. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరుంది. రాయలసీమలో చాలా ఏళ్లు పని చేసిన స్టీఫెన్.. మావోయిజం, ఫ్యాక్షనిజాలను కట్టడి చేసిన అధికారిగా గుర్తింపు ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *