రెండు యూనిట్ల కరెంట్‌తో 120 కిలోమీటర్లు వెళ్లే బైక్!

రెండు యూనిట్ల కరెంట్‌తో 120 కిలోమీటర్లు వెళ్లే బైక్!

ఇపుడు కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. వాహనాలకు పెట్రోల్, డీజిల్ బదులు ఛార్జింగ్ పెట్టుకుంటే సరి…ఎంచక్కా దూసుకుపోవచ్చు. ఈ తరహా ఎలక్ట్రిక్ వాహనాల కోవలోకి కొత్తగా ‘ప్యూర్ ఈవీ’ అనే కొత్త బైక్ చేరింది. హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్, ముంబై ఐఐటీకి చెందిన రోహిత్‌లు కలిసి 2016లో ఏర్పాటు చేసిన ‘ప్యూర్ ఈవీ’ ఈ సరికొత్త బైక్ కలను నిజం చేసింది. వీరిద్దరు కలిసి సంగారెడ్డి జిల్లా, కంది మండలంలో ఏర్పాటు చేసుకున్న రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ పూర్తీ సమర్థవంతంగా పనిచేసే లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేసింది. దీంతోనే ఈ బైక్‌కు అవసమైన ప్రధాన శక్తిని అందిస్తుంది.

ఈ కొత్త బైక్‌ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. కేవలం రెండు యూనిట్ల విద్యుత్‌తో అంటే…రూ. 6తో ఛార్జింగ్ పెట్టుకుంటే సరి…120 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగిరావచ్చు.

45 కిలోల బరువుండే ఈ బైక్‌కి ‘ఈ-ట్రాన్స్’ అని పేరు పెట్టారు. దీని ధర వినియోగదారులు ఎంచుకునే మోడల్‌ను బట్టి రూ. 30 వేల నుంచి రూ. 70 వేల వరకూ ఉంటుందని, మార్చి 2020లోగా 10 వేల వాహనాలను అందుబాటులో తీసుకువస్తామని సంస్థ ఫౌండర్ నిశాంత్ చెప్పారు. పూర్తి ఛార్జింగ్ కు కేవలం నాలుగు గంటల సమయం పడుతుందని, ఆపై 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని నిశాంత్ వెల్లడించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *