నక్షత్ర తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

నక్షత్ర తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

నక్షత్ర తాబేళ్లను అక్రమంగా బంగ్లాదేశ్‌ తరలించేందుకు ప్రయత్నిస్తోన్న ముఠాను డీఆర్ఐ అధికారులు గుట్టురట్టు చేశారు. యశ్వంత్‌పూర్ – హౌరా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లో నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. నక్షత్ర తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా డీఆర్ఐకు సమాచారం అందింది. విజయవాడ నుంచి హౌరాకు ఎస్-7 బోగీలు తాబేళ్లను తరలిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. దీంతో పక్కా సమాచారంతో వైజాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుగానే అధికారులు ఎస్-7 బోగీలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.

1125 నక్షత్ర తాబేళ్లు స్వాధీనం

ఈ తనిఖీల్లో బ్యాగుల్లో ముగ్గురు వ్యక్తులు తాబేళ్లను తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. మొత్తం ఐదు బ్యాగులను స్వాధీనం చేసుకుని వాటిలోని తాబేళ్లను బయటకు తీశారు. బ్యాగుల్లో మొత్తం 1125 నక్షత్ర తాబేళ్లున్నాయి. రకరకాల సైజుల్లో ఉన్న ఈ తాబేళ్లను పరిశీలించడానికి డీఆర్ఐ అధికారులు అటవీశాఖ అధికారులను పిలిపించారు.

హౌరా నుంచి బంగ్లాదేశ్‌కు తరలిస్తామన్న నిందితులు

తాబేళ్లను అక్రమంగా తరలిస్తోన్న ముగ్గురు ప్రయాణికులను కటకటాల వెనక్కి పంపారు. ఈ నక్షత్ర తాబేళ్లను మదనపల్లి నుంచి సేకరించి కర్ణాటకలోని బలెగౌడహళ్లి సమీపంలోని చెలూర్‌కు తీసుకెళ్లామని, అయితే వీటిని హౌరా తీసుకెళ్లి అక్కడ ఒక వ్యక్తికి అప్పగించాల్సిందిగా భేరం కుదిరిందని నిందితులు అధికారులకు తెలిపారు. హౌరా నుంచి వీటిని బంగ్లాదేశ్‌కు తరలిస్తారని చెప్పారు. తాబేళ్లను అటవీశాఖకు స్వాధీనం చేసిన డీఆర్ఐ అధికారులు విచారణ చేపట్టారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *