రాజమౌళికి మరో కొత్త సమస్య!

రాజమౌళికి మరో కొత్త సమస్య!

ఫ్లాప్ అనే మాటే తెలియకుండా ఇప్పటి వరకూ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన రాజమౌళికి ఆర్ ఆర్ ఆర్ మొదలు పెట్టినప్పటి నుంచి మాత్రం రోజుకో తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటికే హీరోలకు గాయాలవడంతో తలపట్టుకున్న రాజమౌళికి మరో కొత్త సమస్య వచ్చిపడింది… రాజమౌళినే టెన్షన్ పెడుతున్న ఆ కొత్త సమస్య ఏంటో మీరూ చూడండి.

RRR 2nd schedule complete

దర్శక దిగ్గజంగా అపజయమెరుగని సినిమాలు చేసిన రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్. మాస్ ఫాలోయింగ్ కి కెరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న యంగ్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చర్మం మొదటిసారి కలిసి నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ప్రీఇండిపెండెన్స్ నేపథ్యంలో దాదాపు 350కోట్ల బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రాజమౌళికి రోజుకో సమస్య వచ్చి పడుతోంది. షూటింగ్ స్టార్ట్ చేసిన మొదట్లో రూమర్స్, లీక్స్ తో తలపట్టుకున్న రాజమౌళి, వాటిని తప్పించుకోవడానికి ఇద్దరు హీరోలతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్ ఆర్ ఆర్ గురించి ఎన్నో క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది అయిపోయాక కలకత్తాలో భారీ షెడ్యూల్ చేయాలి అనుకునే టైంకి ముందు చరణ్ కాలికి గాయం అయ్యింది, సరే చరణ్ సెట్ అయ్యాక అతని సీన్స్ తీయొచ్చు… ఆ లోపు ఎన్టీఆర్ పార్ట్ షూట్ చేద్దాం అనుకుంటే ఇంతలో తారక్ చేతికి కూడా గాయం అయ్యి చిత్ర యూనిట్ ని నిరాశ పరిచింది.

ఈ రెండు దెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాజమౌళికి వచ్చిన కొత్త సమస్య ఎన్టీఆర్ హీరోయిన్… ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉంది.. వీరిలో చరణ్ పక్కన ఒక హీరోయిన్ ఇప్పటికే ఫైనల్ కాగా, ఎన్టీఆర్ పక్కన కనిపించే అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ బ్రిటిష్ ఛాయలు ఉన్న మంచి నటి మాత్రం దొరకట్లేదు. వీలైనంత త్వరగా తారక్ కోసం హీరోయిన్ ని పెట్టుకోకపోతే, షూటింగ్ ఫ్లోకి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది. అందుకే రాజమౌళి ఒక టీంని ప్రత్యేకంగా ఇదే పనిపై నియమించాడని, త్వరలో తారక్ పక్కన నటించబోయే అమ్మాయి ఎవరో తెలుస్తుందని అంటున్నారు. మరి రాజమౌళి దర్శకత్వంలో నటించే అదృష్టం దక్కించుకునే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *