"అమర్ అక్బర్ ఆంటోనీ" మూవీ రివ్యూ

"అమర్ అక్బర్ ఆంటోనీ" మూవీ రివ్యూ

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ గోవా బ్యూటీ ఇలియానా జంటగా తమన్ సంగీత సారధ్యంలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమర్-అక్బర్- ఆంటోనీ చిత్రం చాలా రోజులుగా ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీనువైట్ల అలాగే రాజాదిగ్రేట్ తర్వాత అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ సవ్యసాచి ఫ్లాప్ తర్వాత మైత్రి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మరో చిత్రం ఎలా ఉందో చూద్దాం.

Amar Akbar Anthony review

కథ పరంగా

చాలా రోజుల తర్వాత శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో. అమర్ అక్బర్ ఆంటోనీపై అంచనాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్ తో హైప్ పెంచడంతో రవితేజ ఈసారి ఎలా అయినా హిట్ కొడతాడనే ఆశతో ఉన్న ఫ్యాన్స్ ని అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా థియేటర్స్ లో పలకరించింది. మరి మంచి అంచనాల మధ్య వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఎలా ఉందొ చూద్దాం. కొందరు స్వార్థపరుల వలన తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని అమర్ ఎలా తీర్చుకున్నాడు అనేదే అమర్ అక్బర్ ఆంటోనీ కథా, కథనం. ఎన్నో సినిమాల్లో చుసిన రెగ్యులర్ రెంవేంజ్ డ్రామాకి వైట్ల తన మార్క్ కామెడీని జోడించి మెప్పించే ప్రయత్నం చేశాడు.

సినిమాకే హైలైట్ అయిన రవితేజ

హిట్ కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజ్. మంచి రోల్ పడగానే తన యాక్టింగ్ తో అలరించాడు. అతని పర్ఫార్మెన్స్ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా అమర్ పాత్రలో రవితేజ చాలా బాగా నటించి మెప్పించాడు.

ఆకట్టుకున్న గోవా బ్యూటీ

ఇక చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై మెరిసిన గోవా బ్యూటీ ఇలియానా కొంచెం బొద్దుగా కనిపించినా కూడా తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఫిదా చేసింది. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పలేము కానీ బాగా నటించింది అని మాత్రం చెప్పొచ్చు. మళ్లీ పాత జీరో సైజు బ్యూటీలా మారితే ఇలియానాకి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Amar Akbar Anthony review

మిగిలిన పాత్రల్లో నటించిన సునీల్, జయప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, రఘు బాబు వాళ్ల వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. పాజిటివ్ టచ్ ఉంటూ కథకి అవసరమైన పాత్రలో కనిపించిన షియాజీ షిండే, అద్భుతంగా నటించాడు.

డైరెక్షన్ పరంగా

విలన్స్ రోల్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఫారిన్ లో తెరకెక్కించడం వలన ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కథలో కొత్తదనం లేకపోవడం, కథనంలో వేగం లేకపోవడం, శ్రీను వైట్ల తన పాత మూసధోరణి కామెడీతోనే నడిపించడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్షల మారుతుంది. అమర్ కథలో మరో ఇద్దరినీ పెట్టి సినిమాని నడిపించిన శ్రీనువైట్ల, కింగ్ సినిమాని, అతనొక్కడే సినిమానే మళ్లీ చూపించినట్లు కనిపిస్తుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ఫైనల్ టాక్

మొత్తానికి అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రం రవితేజ కి మరియు శ్రీను వైట్లకి కంద చిత్రమవుతుందని అందరూ అనుకున్నా కూడా శ్రీనువైట్ల పాత కుండలోని కొత్త వంట వండి ప్రేక్షకులని నిరాశపరిచాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మాస్ మహారాజ్ అభిమానులు అమర్ అక్బర్ ఆంటోనీ కేవలం రవితేజ కోసమే చూడాలి.. చాలా రోజుల తర్వాత సూపర్ ఎనర్జీతో రవితేజ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

1
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *