ప్రతీకారం తీర్చుకున్న లంక సైన్యం

ప్రతీకారం తీర్చుకున్న లంక సైన్యం

ఈస్టర్ సండే రోజున ఉగ్రదాడుల తర్వాత ఉగ్రవాదుల కోసం శ్రీలంక భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. అంపార ప్రాంతంలోని సెంథామారుతూ వద్ద ఉగ్రవాదులు దాక్కున్నారని శ్రీలంక భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు వారి కోసం గాలిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే.. మిలిటెంట్లు మూడు సార్లు పేలుడు పదార్థాలు విసిరారు. అంతేకాదు ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నట్లు చెప్పారు పోలీసులు.

ఇక శ్రీలంకన్ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఆరుగురు పిల్లలతో సహా 15 మంది ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల రహస్య స్థావరంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆదేశ మిలటరీ అధికార ప్రతినిధి సుమిత్‌ అటపట్టు వెల్లడించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదసంస్థకు చెందిన 140 మంది అనుమానితులను గుర్తించిన శ్రీలంక పోలీసులు వారిని పట్టుకునేందుకు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. పదివేలమంది శ్రీలంకన్ సైనికులతో ప్రార్థనాలయాలు, సముద్ర తీరప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశారు.

శ్రీలంక తూర్పు తీరంలో మిలటరీ జరిపిన దాడుల్లో ఆరుగురు సూసైడ్ బాంబర్లు హతమయ్యారని శ్రీలంక మిలటరీ వెల్లడించింది. కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు నేషనల్ తౌహీద్ జమాత్ కు చెందిన వారిగా అనుమానిస్తున్నామని మిలటరీ అధికార ప్రతినిధి సుమిత్ పేర్కొన్నారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు చెప్పిన సుమిత్.. ఘటనా స్థలిలో ఓ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు, ప్రస్తుతం అతడు హాస్పిటల్‌లో ఉన్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా లంక బాంబు పేలుళ్లకు ఐసిస్ పాల్పడిందనడానికి ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఇరాక్, సిరియా బయట ఐఎస్ జరిపిన అత్యంత భయంకరమైన దాడి ఇదే అవుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *