చాలా గ్యాప్ తర్వాత సినిమా చేయబోతున్న శ్రీకాంత్ అడ్డాల

చాలా గ్యాప్ తర్వాత సినిమా చేయబోతున్న శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం దెబ్బకి రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. కొంచం విరామం తీసుకుని మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లో శ్రీకాంత్ ఎప్పటినుండో ఒక స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు. రీసెంట్ గా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవ్వడంతో హీరోని వెతుక్కునే పనిలో పడ్డాడు. ఈసినిమాలో హీరోగా గురించి రకరకాల వార్తలు టాలీవుడ్ సర్కీల్‌లో విపించాయి. తాజాగా ఇప్పుడు మరో హీరో పేరు వినిపిస్తోంది..నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోసినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా శ్రీకాంత్ అడ్డాల నానికి కథ చెప్పి ఇంప్రెస్స్ చేసాడట. స్టోరీ బాగుండడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చా డని టాక్. పక్క ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కంటెంట్‌తో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో షూట్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది…. నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ మూవీతో పాటు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో వర్క్ చేస్తున్నాడు. ఈ రెండు మూవీస్ తరువాత శ్రీకాంత్ అడ్డాల సినిమాలో జాయిన్ అవుతాడు. మరి ఈ మూవీతో అయిన శ్రీకాంత్ అడ్డాల హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *