ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ మూవీ 'శ్రీదేవి బంగ్లా'

ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ మూవీ 'శ్రీదేవి బంగ్లా'

శ్రీదేవి…ఫస్ట్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన చోటు సంపాదించుకుంది.ఆమె చనిపోయిన ఏడాది దాటిన తర్వాత…శ్రీదేవి లైఫ్ ని టార్గెట్ చేస్తూ ఒక సినిమా విడుదల కాబోతోంది. వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ హిందీ సినిమా పేరు…’శ్రీదేవి బంగ్లా’.గతంలో మొదటి ట్రైలర్ తోనే శ్రీదేవి మిస్టీరియస్ డెత్ ని,తలపించే విజువల్స్ ని చూపించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి.Priya Varrier Movieస్టార్ డమ్ ని పీక్ స్టేజ్ లో ఎంజాయ్ చేసిన శ్రీదేవి జీవితంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి,అయితే శ్రీదేవి ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అనుకోని పరిస్థితిలో బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది.ఇప్పుడు శ్రీదేవి బంగ్లా కొత్త ట్రైలర్ చూస్తుంటే,శ్రీదేవి జీవితంలో ఎవరికీ తెలియని కోణాన్ని టచ్ చేస్తున్నట్లు ఉన్నారు.ముఖ్యంగా సెకండ్ ట్రైలర్ లో ‘దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది’అని శ్రీదేవిని,అదే ప్రియా ప్రకాష్ ని ఓ వ్యక్తి బెదిరించటం కనిపిస్తోంది.ఇదంతా నిజంగా శ్రీదేవి లైఫ్ లో జరిగిందా లేక ఫిక్షనా అనేది తెలియదు కానీ,ఈ కొత్త ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలని పెంచడంలో సక్సస్ అయింది.సినీ అభిమానులకి ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ట్రైలరే ఇలా ఉంటే శ్రీదేవి బంగ్లా ఇంకా ఎన్ని వివాదాల్ని మోసుకొస్తుందోనన్న సందేహాలు రెయిజ్ అవుతున్నాయి.ఇప్పటికే శ్రీదేవి బంగ్లా సినిమాపై కోర్ట్ కేసులో ఉన్నాయి.కమర్షియల్ సక్సెస్ కోసం తమ అభిమాన తార శ్రీదేవి క్యారెక్టర్ ని డీగ్రేడ్ చేసి చూపిస్తే సహించేందుకు,శ్రీదేవి కుటుంబ సభ్యులు,అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలి అంటే శ్రీదేవి బంగ్లా రిలీజ్ వరకూ ఆగాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *