9 ఏళ్ళ లోకేష్, రియల్ మగధీర

9 ఏళ్ళ లోకేష్, రియల్ మగధీర

ఈ 9 ఏళ్ల కుర్రోడి పేరు లోకేశ్‌…హార్స్‌ రేసింగ్‌ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకున్నాడు.ఏటా జరిగే ఉత్సవాల్లో గుర్రపు స్వారీలు నిర్వహిస్తుంటారు.ఈసారి పోటీల సందర్భంగా లోకేశ్‌ గాయపడ్డాడు.గుర్రంపై నుంచి ఒక్కసారిగా జారిపడ్డాడు.దెబ్బలు తగిలాయని భయపడలేదు.వెంటనే స్నేహితుల సాయంతో మోటార్‌ సైకిల్‌పై వచ్చి మళ్లీ గుర్రం ఎక్కేశాడు.నిజంగా రియల్‌ మగధీరను తలపించాడు. కర్నాటకలో బెళగావి జిల్లా చిక్కోడిలో ఈ ప్రమాదం జరిగింది.భండారా ఫెస్టివల్‌లో భాగంగా ఏటా అక్కడ హార్స్‌ రేస్‌ నిర్వహిస్తారు.ప్రమాదం జరిగిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

ఈ రేసులో 9 ఏళ్ల లోకేషే గెలిచాడు.స్థానికులు అతణ్ని జాకీ లోకేష్‌ అని పిలుస్తారు.ఈ ప్రమాదంలో లోకేష్‌కు 10 చోట్ల గాయాలు అయ్యాయి.అతడి గుర్రం పేరు షరియత్‌.అయినా దెబ్బలు లెక్కచేయని లోకేష్‌ తాను అనుకున్నది సాధించాడు.ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే…లోకేష్‌ గుర్రంపై నుంచి పడగానే పక్కనే వెహికల్‌ వస్తోంది.కొంచెం అయితే దాని టైరు లోకేష్‌ పైనుంచి పోయేది.అదృష్టవశాత్తూ లోకేష్‌కు ఏం కాలేదు.కానీ చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు.ఇప్పుడు ఈ రియల్‌ మగధీర…రియల్‌ సాహాసాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు.

లోకేష్‌ది పేద కుటుంబం….తల్లీదండ్రులు నిరుపేద కూలీలు…ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే…గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పిస్తాం అంటున్నారు పేరెంట్స్‌. నిజంగా లోకేష్‌కు తగిన శిక్షణ ఇప్పిస్తే…భవిష్యత్‌లో మంచి జాకీగా మారే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో అతడి ధైర్య సాహాసాలకు మచ్చు తునకగా భావిస్తున్న ఈ ప్రమాదాన్ని మరోసారి చూద్దాం.పరుగెడుతున్న గుర్రం స్లిప్‌ అయ్యి లోకేష్‌ కిందపడిపోయాడు.కానీ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. స్నేహితుల సాయంతో మళ్లీ గుర్రం కళ్లెం అందుకున్నాడు.అతడి గుర్రం షరియత్‌…లోకేష్‌ కిందపడ్డా ఆగకుండా దౌడు తీసింది.ఎందుకంటే తన రౌతు కచ్చితంగా తిరిగివస్తాడని దానికి తెలుసు.షరియత్‌ అనుకున్నట్లే జరిగింది. లోకేష్‌ తిరిగి వచ్చాడు.గెలుపు ఓటములను పక్కనబెట్టినా…లోకేష్‌ పేరు ఇప్పుడు కర్నాటకలో మార్మోగిపోతోంది. లోకేష్‌…యువర్‌ రియల్లీ రియల్‌ హీరో…హేట్సాఫ్‌ టు లోకేష్‌.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *