రోజుకో మలుపు తిరుగుతున్న కర్నాటక రాజకీయాలు..!

రోజుకో మలుపు తిరుగుతున్న కర్నాటక రాజకీయాలు..!

కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి… సీఎం కుర్చీ ఎప్పడు దక్కుతోందో అని బీజీపీ వ్యూహ, ప్రతి వ్యూహాలు వేడిని పుట్టింస్తున్నాయి. దీనిపై స్పీకర్ రమేష్‌ కుమార్ దీనిపై స్పందించటతో కర్నాటకీయం మరో మలుపు తీసుకుంది.

కర్నాటకలో రాజకీయం సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మంగళవారం సీఎల్పీ సమావేశానికి పిలుపునిచ్చిన కాంగ్రెస్… పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తమ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని స్పీకర్‌కు వినతి పత్రం సమర్పింది. అయనప్పటికీ రాజీనామాల పర్వానికి పులుస్టాప్ పడలేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన గంటల వ్యవదిలో ఐఎంఏ జ్యూవెల్స్ కుంభకోణంపై విచారణకు హాజరు కావాలని సిట్ నుంచి ఆయనకు పిలుపు అందింది.

మరోవైపు కర్ణాటక సంక్షోభంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు వచ్చింది. జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా కుట్ర పన్నుతోందని కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో విమర్శించారు. రాజీనామాల చేసిన వారిని… బీజేపీ ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించిందని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. అయితే దీనిపై స్పందించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జేడీఎస్‌-కాంగ్రెస్‌ అంతర్గత పోరు వలన రాజీనామాలు చేస్తున్నారని అన్నారు. ప్రతీ విషయానికి బీజేపీపై బురద జల్లటం సరికాదని మండిపడ్డారు.

అయితే కాంగ్రెస్ సమర్పించిన పత్రంపై స్పందించిన స్పీకర్ రమేష్‌ కుమార్ రెబల్ ఎమ్మెల్యే జోరుకు చెక్ పెట్టారు. ఇప్పటి వరకూ తనకు 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు లేఖలు ఇచ్చారని అందులో ఐదు మాత్రమే సరైన ఫార్మాట్‌లో ఉన్నాయని అన్నారు. మిగతా 9 మంది ఎమ్మెలు రాజీనామాలు చెల్లవని తెలిపారు. నిబంధనల మేరకు వారంతా తన ముందు హాజరై.. రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని నిర్ధారిస్తే.. వాటిని ఆమోదిస్తానని రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. తనను కలిసేందుకు ఈనెల 12న కొందరికి, 15న మరికొందరికి సమయం ఇస్తున్నానని అన్నారు. ఈ లోపు హాజరుకావలని అన్నారు.

అయితే రోజుకో మలుపు తిరుగుతున్న కర్నాటక ఇంకా ఎంతవరకు కొనసాగుతోందో తెలియక పలువురు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఉత్కంఠకు ఎప్పటికి తెరపడుతోందో అని ఎదురు చూస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *