జమ్ము కశ్మీర్‌ డీజీపీ పై వేటు

జమ్ము కశ్మీర్‌ డీజీపీ పై వేటు

జమ్ము కశ్మీర్‌ లో తరచు జరిగే ఉగ్రవాదుల దాడుల్లో పోలీసులు ప్రాణాలు కోల్పోతుంటారు. అధికారులు కిడ్నాప్‌ అవుతుంటారు. కిడ్నాపైన పోలీసు అధికారులు, వారి కుటుంబ సభ్యులను రక్షించేందుకు తప్పనిసరి పరిస్థితిలో ఉగ్రవాదులను విడుదల చేసి జమ్ము కశ్మీర్‌ డీజీపీ ఎస్‌.పి.వేద్‌ భారీమూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆయన తన పదవినే పోగొట్టుకున్నారు.

పోలీసు అధికారుల్ని కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు

జమ్మకశ్మీర్‌లో ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించింది. ఇందుకు ప్రభుత్వంతో విభేదాలే కారణమంటున్నారు. ఉగ్రవాదుల విడుదల నేపథ్యంలో కేంద్రంతో ఏర్పడిన విభేదాలవల్లే ఆయనపై వేటు పడిందని అంటున్నారు. గత వారం దక్షిణ కశ్మీర్‌లో ముగ్గురు పోలీసు అధికారులు, ఎనిమిది మంది వారి బంధువులను ఉగ్రవాదులు అపహరించారు.

sp vaid

పోలీస్‌ అధికారుల్ని విడిచిపెట్టాలంటే పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాదులను విడిచిపెట్టాలని టెర్రరిస్టులు డిమాండ్‌ చేశారు. దీంతో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ రివైజ్‌ నైకూ తండ్రితో సహా మొత్తం 12 మందిని పోలీసులు వదిలేశారు. డిజీపీ వేద్‌ ఆదేశం మేరకే ఉగ్రవాదుల్ని వదిలేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ చర్య కేంద్ర హోంశాఖకు ఆగ్రహం తెప్పించింది. అందుకే వేద్‌పై వేటు వేశారంటున్నారు. వేద్‌ స్థానంలో జైళ్ల శాఖ డీజీ దిల్బాగ్‌ సింగ్‌కు జమ్ము కశ్మీర్‌ ఇన్‌చార్జి డీజీపీ బాధ్యతలు అప్పగించారు. వేద్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ అబ్దుల్‌ గనీమిర్‌ను కూడా బదిలీ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *