ఐపీఎల్‌లో గంగూలీ రీ ఎంట్రీ...మరింత బలంతో ఢిల్లీ జట్టు

ఐపీఎల్‌లో గంగూలీ రీ ఎంట్రీ...మరింత బలంతో ఢిల్లీ జట్టు

మార్చి 23 నుంచి ఐపీఎల్‌ సీజన్‌ 2019 ప్రారంభం కానుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా అభిమానులనూ, ప్రేక్షకులనూ పెంచుకుంటూ వెళ్తున్న ఐపీఎల్ మరోసారి అలరించేందుకు సిద్ధమైపోయింది. ఎవరెవరు ఏ జట్టుకు ఆడుతున్నారో తేలిపోయింది. ఏ రోజున ఎవరెవరు తలబడుతున్నారో తెలిసిపోయింది. ఇక రసవత్తరమైన పోరే మిగిలుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి కుర్రాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొత్త కుర్రాళ్ల జోరును సీనియర్లు ఎలా ఎదుర్కొంటారా అని… ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిజట్టూ మునిపటి కంటే పటిష్టమయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఢిల్లీ జట్టు గంగూలీని ఆశ్రయించింది. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ సీజన్‌ 2019 ప్రారంభం కానుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా అభిమానులనూ, ప్రేక్షకులనూ పెంచుకుంటూ వెళ్తున్న ఐపీఎల్ మరోసారి అలరించేందుకు సిద్ధమైపోయింది. ఎవరెవరు ఏ జట్టుకు ఆడుతున్నారో తేలిపోయింది. ఏ రోజున ఎవరెవరు తలబడుతున్నారో తెలిసిపోయింది. ఇక రసవత్తరమైన పోరే మిగిలుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి కుర్రాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొత్త కుర్రాళ్ల జోరును సీనియర్లు ఎలా ఎదుర్కొంటారా అని… ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిజట్టూ మునిపటి కంటే పటిష్టమయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఢిల్లీ జట్టు గంగూలీని ఆశ్రయించింది.

దాదా రీ ఎంట్రీ…

గంగూలీ… ఈ పేరును టీం ఇండియా అభిమానులే కాదు, ప్రపంచ క్రికెట్‌ అభిమానులూ మర్చిపోరు. అరుదైన కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నాడు. భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. ఆటగాడిగానూ, కెప్టెన్‌గానూ సూపర్ సక్సెస్‌ అయ్యాడు. ఐపీఎల్‌ ప్రారంభమైన కొన్నేళ్ల పాటు ఈ పొట్ట ఫార్మాట్‌లోనూ అభిమానులను అలరించాడు. అయితే కొంతకాలంగా దాదా అన్ని ఫార్మాట్లకూ దూరంగా ఉండటంతో అతడిని అభిమానులు బాగా మిస్‌ అయ్యారు. ఇప్పుడు ఢిల్లీ జట్టు రూపంలో దాదా మరోసారి ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు. కొత్త కుర్రాళ్లతో బలమైన టీంగా ఉన్నా… విజయాలను సాధించడంలో మాత్రం ఢిల్లీ జట్టు వెనకబడిపోయింది. దీనికి మంచి టాలెంట్ ఉన్న సలహాదారుడిని ఆశ్రయించడమే ప్రత్యామ్నాయంగా భావించి. దీంతో మరో ఆలోచన చేయకుండా టీం ఇండియా మాజీ సారథి గంగూలీని ఆశ్రయించింది. దాదా కూడా వెంటనే ఓకే చెప్పాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టుకు సలహాదారుడిగా ఉండబోతున్నాడు. ఎంతో కాలంగా తమ అభిమాన ఆటగాడిని మిస్‌ అవుతున్న అభిమానులు ఈ విధంగా దాదాను కన్నుల నిండా చూసేయొచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *