టీఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత గుడ్‌ బై

టీఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత గుడ్‌ బై

టీఆర్ఎస్ కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గుడ్ బై చెప్పారు.సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. ఈ విషయాన్ని మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సోమారపు వెల్లడించారు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పనిచేశారని ఆరోపించారు. తను ఏ పార్టీలో చేరనని.. ఇండిపెండెంట్‌గానే ఉంటానని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించుకుంటానని అన్నారు. అయితే గత కొలంగా స్థానికంగా టీఆర్‌ఎస్‌లో నెలకొన్న వర్గపోరు కారణంగానే సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *