కావాలనే నెమ్మదిగా ఆడారా? ధోనీ-జాదవ్ ఆటతీరుపై విమర్శలు!

కావాలనే నెమ్మదిగా ఆడారా? ధోనీ-జాదవ్ ఆటతీరుపై విమర్శలు!

ప్రపంచ వరల్డ్‌కప్‌లో భారత్ తొలి ఓటమిని చూసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియన్ టీమ్‌కు ఇంగ్లీస్ బ్యాట్స్‌మెన్స్ కట్టడి చేశారు. అయితే…ఈ మ్యాచ్‌లో భారీ స్కోరును ఉంచినా…చక్కని బ్యాటింగ్‌తో ఫామ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు…చివరి ఓవర్లలో అస్సలు ఆడకపోవడం పెద్ద విమర్శలకు దారి తీస్తోంది. దీనికి ప్రధాన కారణంగా ధోనీ, కేదార్ జాదవ్‌లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. క్రీడాభిమానుల నుంచి, ప్రముఖులు సైతం ఈ ఇద్దరి జోడీని సోషల్ మీడీయాలో దుమ్మెత్తి పోస్తున్నారు.

సింగిల్స్ తీయడమేంటి!?
భారీ స్కోరుని సైతం అలవోకగా కొట్టగలిగే సమయంలో క్రీజులో ధోనీ, జాదవ్‌లు ఉన్నారు. చివరి ఐదు ఓవర్లలో 70 పరుగులు మాత్రమే చేయాల్సిన తరుణంలో ఈ ఇద్దరూ కేవలం సింగిల్స్‌కే పరిమితం కావడమే అందరి ఆగ్రహానికి కారణం. కొంచెం కష్టపడితే గెలవగలిగే మ్యాచ్‌ని సైతం నెమ్మదిగా ఆడి ఓడిపోయేలా చేశారని సోషల్ మీడియాలో అభిమానులు ఈ జోడీని విమర్శిస్తున్నారు. ప్రత్యర్థి పేసర్‌ల బౌలింగ్‌లో చాలాసార్లు బంతిని బ్యాట్‌కు కనీసం కొట్టలేకపోవడం మరిన్ని విమర్శలకు తావినిస్తోంది. మధ్య ఓవర్ల తరహాలో సింగిల్స్‌ తీస్తూ ప్రేక్షకుల ఓపికను పరీక్షించారు.

మైదానం వీడారు…
ధోని-జాదవ్‌ల ఆటతీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 300పై చిలుకు లక్ష్యాన్ని చూసి భారత బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేశారని, ఆడినంతసేపు సింగిల్స్‌పైనే దృష్టిపెట్టారని, గెలవాలనే స్పృహతో ఆడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఐదు వికెట్ల ఉండీ కూడా భారీ షాట్లకు ప్రయత్నం చేయలేకపోవడం ఆశ్యర్యానికి గురిచేసిందని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ నాసర్‌ హుస్సెన్‌ సైతం ధోని-జాదవ్‌ల ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ తరహా బ్యాటింగ్‌ టీమిండియాకు అనవసరం అన్నాడు. వీరి ఆటను చూడలేక అభిమానులు కూడా మైదానం వీడుతున్నారని వ్యాఖ్యానించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ కూడా నెమ్మదైన బ్యాటింగ్‌ను తప్పుబట్టాడు. మొదటి 10 ఓవర్లు, చివరి 6 ఓవర్లలో భారత్‌ పరుగులు చేయలేకపోవడం ఇబ్బందిగా ఉందని చెప్పాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *