విచ్చలవిడిగా వాడేస్తోన్న నగరవాసులు

విచ్చలవిడిగా వాడేస్తోన్న నగరవాసులు

స్మార్ట్‌ గాడ్జెట్స్‌ తో నిద్రలేమి

స్మార్ట్‌ టెక్నాలజీ ఇప్పటివరకు మానవ సంబంధాలనే దెబ్బతీసిందనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రశాంతతని కూడా దెబ్బతీస్తోందట. ముఖ్యంగా నిద్రలేమికి కారణమువుతోందట. సిటీజనాల్లో ఎక్కువమంది సోషల్‌మీడియా, గాడ్జెట్స్ వల్ల ఆలస్యంగా నిద్రపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఇలా ఆలస్యంగా నిద్రపోతున్నవారి సంఖ్య 53 శాతం ఉందని సెంచూరీ సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాల్లో 1,524 మందిని చేసిన సర్వేలో ఇది తేలింది. హైదరాబాద్లో అయితే ఏకంగా 70 శాతం మంది ప్రజలు సోషల్ మీడియా, గాడ్జెట్స్ ప్రభావంతో ఆలస్యంగా నిద్రిపోతున్నారట. అర్ధరాత్రి దాటేవరకు టీవీషోలు, ల్యాప్‌టాప్, టాబ్లెట్స్, అండ్ మొబైల్‌ఫోన్ ,సోషల్‌మీడియా బ్రౌజింగ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రాం వంటివాటిలో మునిగితేలుతున్నట్లు సర్వేచెబుతోంది. ఇక 18 శాతం మంది ఫైనాన్షియల్‌, వర్క్‌ పరంగా మేల్కొని ఉంటున్నారని తెలిపింది.

Sleep disturbance social media

54 శాతం మందిలో 25 శాతం మంది వీకెండ్‌లో కేవలం 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోతున్నారు. నిద్రపోయినప్పుడు రెండు నుంచి మూడుసార్లు మెలకువతో లేస్తున్నారట.మంచి నిద్రకు సౌకర్యవంతమైన పరుపులను వాడాలి. అలాగే గాడ్జెట్స్‌ని వాడకపోవడం మంచిదని సెంచురీ నీల్సన్‌ సర్వే వివరించింది. 10 నగరాల విషయానికి వస్తే పుణె, హైదరాబాద్, ఇండోర్, వైజాగ్, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, అహ్మదాబాద్ పట్టణాల్లో సర్వేచేసినట్లు సెంచరీ పరుపుల ఈడీ ఉత్తమ్ మలాని తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *