స్మృతి మంథనీ బ్యాటింగ్...ఆసీస్ టీమ్ కౌంటింగ్

స్మృతి మంథనీ బ్యాటింగ్...ఆసీస్ టీమ్ కౌంటింగ్

ఇప్పటిదాకా బ్యాట్స్‌మెన్స్ గురించే మాట్లాడుకున్నాం. వారి రికార్డులనే వల్లెవేశాం. ఇకనుంచి వారి స్థానంలో కొత్త పేర్లు రాబోతున్నాయి. ఇకమీదట బ్యాట్స్‌వుమెన్స్ గురించి చర్చించుకుంటాం. ప్రస్తుతం టీ20 మహిళల వరల్డ్‌కప్ జరుగుతున్న సంగతి మాట్లాడుకుందాం…

కొంచెం గ్యాప్ తర్వాత…

మహిళల వరల్డ్‌కప్‌లో వరుసగా నాలుగు విజయాలతో మహిళా క్రికెటర్లు చెలరేగిపోతున్నారు. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో గెలిచి, వరల్డ్‌కప్ అందుకునేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌వుమెన్‌తో పాటు బౌలర్లు కూడా విజృంభించడంతో సులభంగా గెలుపు సాధ్యమయింది. మొదటి మూడు మ్యాచుల్లో ఏ మాత్రం ప్రభావం చూపని స్మృతి మంథాన ఈ మ్యాచ్‌లో తన బ్యాట్ పవరేంటో చూపించింది. 55 బంతుల్లో 83 పరుగులు చేసి ఆసీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. అనారోగ్యం కారణంగా మిథాలీ రాజ్ ఈ మ్యాచ్ ఆడలేకపోయింది.

smriti mandhana

ముగ్గురే ట్రై చేశారు…

టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఇండియా టీమ్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో చెలెరేగి ఆడిన ఇండియన్ ఉమెన్స్‌టీమ్ తర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటి ఆసీస్ బౌలర్లను ఇరుకున పెట్టారు. లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో అసీస్ టీమ్ భారత బౌలర్ల ధాటికి 119 పరుగులకే చాప చుట్టేసింది. అసీస్ టీమ్ మొత్తంలో ఎలైస్ పెరీ (39), గార్డ్‌నర్ (20), కెప్టెన్ మెగ్ లానింగ్(10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

smriti mandhana

ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన స్మృతి మంథాన భారత మహిళా క్రికెట్, టీ20ల్లో వేగంగా 1000 పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డు దక్కించుకుంది. మంథనీ 49 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించగా…గతంలో మిథాలి రాజ్ కేవలం 44 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సృష్టించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *