అమేథీలో స్మృతీ ఇరానీ అడ్డంగా బుక్కయ్యారా?

అమేథీలో స్మృతీ ఇరానీ అడ్డంగా బుక్కయ్యారా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్మృతి ఇరానీ గురించిన చర్చే నడుస్తుంది.విద్యార్హతల విషయంలో తప్పుడు వివరాలు పొందిపర్చినట్లు నిరూపణ కావడంతో విపక్షాలు స్మృతి ఇరానీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.2004 ఎన్నికల్లో స్మృతి ఇరానీ తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు పేర్కొన్నారు.తీరా 2014లో అమేథీ నుంచి బరిలో నిలిచిన సమయంలో బీకామ్‌ కోసం 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూర విద్యలో ప్రవేశం పొందినట్టు తెలిపారు.ఈ సారి అమేథీ నుంచి దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో తాను గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేయలేదని వెల్లడించారు.

అయితే 2014 ఆగస్టులో ఓ మీడియా సమావేశంలో స్మృతి మాట్లాడుతూ..తాను ప్రతిష్టాత్మక యేల్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినట్టు చెప్పుకొచ్చారు.అయితే అప్పుడు ఆ డిగ్రీ వివరాలు ఎందుకు ఆఫిడవిట్‌లో పొందుపర్చలేదని ప్రతిపక్షాలు స్మృతిని ప్రశ్నించాయి.స్మృతి ఇరానీ తన విద్యార్హత విషయంలో తప్పుదారి పట్టించిందని ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే.అయితే తాజా ఆఫిడవిట్‌లో స్మృతి డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొనడంపై విపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి.మంత్రి పదవి మారినట్టుగానే డిగ్రీలు కూడా మారతాయా అని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఓ అడుగు ముందుకేసి ‘బీజేపీ కొత్త సీరియల్‌ స్టార్ట్‌ చేసింది.దాని టైటిల్‌ ‘మంత్రి ఒకప్పటి గ్రాడ్యూయేటే’.ఇక్కడ విద్యార్హతలు మారతూ ఉండటమే కాక కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి.కొత్త డిగ్రీ వస్తే..పాతది పోతుంది.కొత్త కొత్త అఫిడవిట్లు తయారవుతుంటాయి’అంటూ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.ఈ వ్యాఖ్యలు స్మృతి ఇరానీ నటించిన ‘క్యోం కి సాస్‌ భీ కభీ బహు థీ’(అత్త ఒకప్పటి కోడలే) అనే సీరియల్‌ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.దాదాపు ఎనిమిదేళ్ల పాటు నడిచిన ఈ సీరియల్‌లో స్మృతి ఇరానీ లీడ్‌ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే.

విద్యార్హతల విషయంపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా..స్మృతి మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా..అవేవీ తన గెలుపును అడ్డుకోలేవని ఆమె ధీమా వ్యక్తం చేశారు.కానీ తప్పుడు విద్యార్హతలు పొందుపర్చడం గురించి మాత్రం స్మృతి స్పందిలేదు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథి నుంచి బరిలోకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై ప్రస్తుతం రగడ నడుస్తోంది.2014లో సమర్పించిన అఫిడవిట్ లో స్మృతి ఇరానీ తాను 1994లో డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.అయితే 2019లో దాఖలు చేసిన అఫిడవిట్ లో మాత్రం తాను 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో ఓపెన్ స్కూల్ విధానంలో బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ కోర్సులో చేరానని అయితే మొదటి సంవత్సరంతోనే డిస్ కంటిన్యూ చేసినట్లు పేర్కొన్నారు.అయితే స్మృతి ఇరానీ ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.అంతే కాదు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గానూ ఆమెను ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.స్మృతి ఇరానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం,చేయకపోవడం వివాదం కాదని,అయితే ఎన్నికల సంఘాన్ని తప్పుదోవపట్టించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది విమర్శించారు.అంతేకాదు గతంలో కోర్టులకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు.అయితే విద్యార్హతలకు సంబంధించి తప్పుడు రికార్డులు తయారు చేయడంతో పాటు,తప్పుడు అఫిడవిట్ లు సమర్పించిన నేపథ్యంలో స్మృతి ఇరానీ చట్టప్రకారం శిక్షార్హురాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ విద్యార్హతల విషయంలో 2019లో సమర్పించిన అఫిడవిట్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి కాలేదని ప్రకటించడంతో,నెటిజన్లు స్పందిస్తున్నారు.స్మృతి ఇరానీ గ్రాడ్యూయేషన్ కూడా పూర్తి చేయకుండా ఇంత కాలం బుకాయించడం పట్ల నెటిజన్లు ట్వీట్లతో విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్ కంచుకోట,తన సిట్టింగ్ స్థానమైన అమేథీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు.రాహుల్ గాంధీపై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ…మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు.
సహజంగా వీవీఐపీలు పోటీ చేసే స్థానాలకు ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టవు.ఇందుకు రెండు కారణాలు.మొదటిది వీవీఐపీ కచ్చితంగా గెలుస్తారన్న ఆలోచన.రెండోది వీవీఐపీకి ఇచ్చే గౌరవం.ఎంత శత్రువైనా రాజకీయ పార్టీలు ఈ రూల్ పాటిస్తుంటాయి.కానీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ ఈ రూల్ పక్కన పెడుతోంది.రాహులైతే ఏంటి…ఓడించి తీరాల్సిందే అంటూ…బీజేపీ పవర్ బ్రాండ్ స్మృతి ఇరానీని మరోసారి రాహుల్ కంచుకోటైన అమేథీ నుంచీ బరిలో దింపింది.రాహుల్‌ని ఆమె ఓడించగలరా అంటే…కష్టమే అన్న సమాధానం స్పష్టం. ఎందుకంటే…అమేథీ నియోజకవర్గం మొదటి నుంచీ…అంటే సంజయ్ గాంధీ తరం నుంచీ కాంగ్రెస్ కంచుకోటగా ఉంది.2014లో దేశమంతా నరేంద్ర మోదీ మేనియా ఉన్నప్పుడు కూడా రాహుల్…ఇరానీని లక్ష ఓట్ల తేడాతో ఓడించారు.బట్…అప్పుడు ఆమె పరిస్థితి వేరు…ఇప్పుడు వేరు.రాహుల్ ఎలాగైతే ఈ ఐదేళ్లలో రాటుదేలారో…స్మృతి ఇరానీ కూడా దేశ ప్రజల్లో తన క్రేజ్ పెంచుకున్నారు.కేంద్ర మంత్రిగా ఉంటూ,అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ,ప్రత్యర్థులకు బలమైన కౌంటర్లు ఇస్తూ…ఎక్కడా వెనక్కి తగ్గకుండా చెలరేగిపోయే తత్వంతో ముందుకు సాగారామె.అందువల్ల రాహుల్‌కి ఈసారి స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇస్తున్నారనడంలో మనం సందేహాల్ని పక్కన పెట్టెయ్యవచ్చు.

రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎక్కువ అంచనా వేసినా,తక్కువ అంచనా వేసినా ప్రమాదమే.రాహుల్ సంగతేమోకానీ…కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం…స్మృతి ఇరానీ దూకుడుపై ఒకింత భయాందోళనలు ఉన్నట్లు కనిపిస్తోంది.ఒకవేళ ఆమె గనక రాహుల్‌ని ఓడిస్తే,అది రాహుల్ కెరీర్‌పైనే కాదు…కాంగ్రెస్ ఫ్యూచర్‌కి కూడా భారీ దెబ్బ కొట్టినట్లవుతుంది.అంతే కాదు…బీజేపీలో స్మృతీ ఇరానీ గ్రాఫ్ దూసుకెళ్తుంది.ఒకవేళ రాహుల్ ఓడిపోతే,పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే…ఆయన మరో చోటి నుంచీ పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో ఉన్నారు పార్టీ నేతలు.అందుకే కేరళ లోని వయనాడ్ నుంచీ రాహుల్ పోటీ చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయని ఢిల్లీలో ప్రచారం మొదలైంది.

స్మృతీ ఇరానీకి అంత సీన్ ఉందా : దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో స్మృతి ఇరానీ ఒకరు.కేంద్ర మంత్రిగా ఆమె పెద్దగా చేసిందేమీ లేకపోయినా,వివాదాలే ఆమెకు గుర్తింపు తెస్తున్నాయి.ఎప్పుడూ ప్రజల నోళ్లలో ఆమె పేరు పలికేలా చేస్తున్నాయి.అంతమాత్రాన ఆమె రాజకీయంగా దూసుకుపోగలరని భావించలేం.ఐతే…రాహుల్‌ని ఓడించేందుకు…స్మృతి ఇరానీకి ఈసారి కొన్ని అదనపు ఆయుధాలు చేరాయి.అవేంటంటే…

కేంద్రంలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఇది చదవండి
స్మృతి ఇరానీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి…డిగ్రీ డిస్‌కంటిన్యూ వివాదంపై ముదరుతున్న రగడ…స్మృతి ఇరానీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి…డిగ్రీ డిస్‌కంటిన్యూ వివాదంపై ముదరుతున్న రగడ…అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్.. అఫిడవిట్‌లో ఆసక్తికరమైన అంశం..అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్..అఫిడవిట్‌లో ఆసక్తికరమైన అంశం..రాహుల్ తలపై ‘లేజర్ లైట్’…స్నైపర్‌గన్‌తో గురి..కాంగ్రెస్ సంచలన ఆరోపణలురాహుల్ తలపై ‘లేజర్ లైట్’…స్నైపర్‌గన్‌తో గురి..కాంగ్రెస్ సంచలన ఆరోపణలురాహుల్ గాంధీ నామినేషన్ తర్వాత ప్రియాంకాగాంధీ సెంటిమెంట్ కామెంట్స్రాహుల్ గాంధీ నామినేషన్ తర్వాత ప్రియాంకాగాంధీ సెంటిమెంట్ కామెంట్స్తల్లి, చెల్లితో కలిసి అమేథిలో రాహుల్ గాంధీ నామినేషన్..తల్లి,చెల్లితో కలిసి అమేథిలో రాహుల్ గాంధీ నామినేషన్..ఆయనకు భూములతో ప్రత్యేక అనుబంధం…ప్రియాంక గాంధీ భర్తపై స్మృతి ఇరానీ సెటైర్లు…ఆయనకు భూములతో ప్రత్యేక అనుబంధం…ప్రియాంక గాంధీ భర్తపై స్మృతి ఇరానీ సెటైర్లు…

అమేథీలో 4 అసెంబ్లీ స్థానాలుండగా… 2017లో జగదీష్‌పూర్, గౌరిగంజ్,అమేథీల్లో బీజేపీ గెలిచింది. ఇది కాంగ్రెస్‌కి షాకింగ్ సీన్.
దేశవ్యాప్త పర్యటనల వల్ల అమేథీపై రాహుల్ ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్స్ లేదు.స్మృతీ ఇరానీ మాత్రం రోజంతా అక్కడే ఉండి…వీలైనన్ని విమర్శలు రాహుల్‌పై చేస్తూ…కాంగ్రెస్ అధినేతపై ప్రజా వ్యతిరేకతను పెంచవచ్చు.
2009,2014లో ఆమేథీ ప్రజలు ఎంతగానో ఆదరించినా,రాహుల్ ఆ స్థాయిలో అమేథీకి ఏమీ చెయ్యలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.ముఖ్యంగా 2014 తర్వాత రాహుల్ అమేథీని దాదాపు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.అయినప్పటికీ ఇప్పటికీ గాంధీ కుటుంబంపై అమేథీ ప్రజల్లో అభిమానం తగ్గలేదని తెలుస్తోంది.

1967 నుంచీ 2014 వరకు అమేథీలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా…రెండుసార్లు మాత్రమే కాంగ్రెసేతర పార్టీలు విజయం సాధించాయి.అయినప్పటికీ…టీవీ నటిగా పరిచయమై….2003లో బీజేపీలో చేరి…2011లో రాజ్యసభలో అడుగుపెట్టి…కేబినెట్ మంత్రిగా మారి…వరుసగా మూడు శాఖలు నిర్వహించి.. తిరుగులేని ట్రాక్ రికార్డుతో దూసుకొస్తున్న స్మృతి ఇరానీ విషయంలో రాహుల్ జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఈ విషయంలో కాంగ్రెస్ ఏమాత్రం తడబడినా…చరిత్రలో ఆ పార్టీ…అతి పెద్ద పొరపాటు చేసినట్లవుతుందని

రాహుల్‌ గాంధీ వర్సెస్‌ స్మృతి ఇరానీ..రెండోస్సారి!ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న అమేఠీ నుంచి వరుసగా రెండోసారి స్మృతి ఇరానీ ఆయనపై పోటీకి సిద్ధమయ్యారు.గురువారం బీజేపీ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆ స్థానాన్ని ఆమెకు కేటాయించారు.రాజీవ్‌గాంధీ, సంజయ్‌గాంధీ, సోనియాగాంధీ..ఇలా ముగ్గురు ‘గాంధీ’లను గెలిపించిన అమేఠీ నుంచే 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన రాహుల్‌గాంధీ..2.90 లక్షల ఓట్ల తేడాతో గెలుపు జెండా ఎగరేశారు.2009లోనూ బీఎస్పీ అభ్యర్థి ఆశీష్‌ శుక్లాపై 3.70 లక్షల తేడాతో గెలిచి సత్తా చాటారు. కానీ.. 2014లో స్మృతి ఇరానీ రాహుల్‌కు గట్టిపోటీ ఇచ్చారు.ఆ ఎన్నికల్లో రాహుల్‌కు స్మృతిపై 1.07 లక్షల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది.

అంతేకాదు.. అమేఠీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ సీట్లలో 4 బీజేపీకి పోగా,ఒకదాంట్లో సమాజ్‌వాదీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.స్మృతి ఓటమిపాలైనప్పటకీ..మోదీ ఆమెను రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు.కేంద్రమంత్రిగా ఉన్నా..ఆమె అమేఠీ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారు.వీలున్న ప్రతి సందర్భంలోనూ అమేఠీలో పర్యటిస్తూ తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.పార్టీ ఆమెకు అక్కడే టికెట్‌ కేటాయించడంతో..‘ఈసారి గెలుపు ఎవరిదో’ అనే ఉత్కంఠ మొదలైంది.ఈ సందర్భంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మృతి మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ఓటమి తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘నేను ఓటమిపాలైనప్పటికీ.. గడచిన ఐదేళ్లుగా ప్రజల అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమించాను.అమేఠీలోని ఐదు సీట్లలో అసెంబ్లీ సీట్లలో నాలుగింటిలో విజయం సాధించాం.ఇక్కడ కాంగ్రెస్‌ ఓట మి తథ్యం’’ అని వ్యాఖ్యానించారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *