వేళ్లను విరిచేస్తున్న స్మార్ట్‌ఫోన్‌

వేళ్లను విరిచేస్తున్న స్మార్ట్‌ఫోన్‌

కాలం చాలానే మార్పులని తెస్తుంది. కొన్ని మార్పులు అభివృద్ధి వేగంలో కొట్టుకుపోతే, మరికొన్ని అభివృద్ధికి సూచికగా మిగులుతాయి. కాలం తెచ్చిన మార్పులు కాలాన్నే ప్రభావితం చేస్తాయి. ఒకరకంగా మనమున్న కాలాన్ని స్మార్ట్‌ఫోన్‌ యుగమని చెప్పుకోవచ్చు. నిత్యావసరాల్లో భాగమైపోయింది. మొత్తం ప్రపంచాన్నీ మన అరచేతుల్లో కూర్చోపెడుతుంది. స్మార్ట్‌ ఫోన్‌ లేనిదే, కాలం ఆగిపోతుందా… అనే స్థాయికి పరిస్థితి వచ్చేసింది. ఒక వైపు అభివృద్ధిని పరిచయం చేస్తూనే, మరోవైపు ఇబ్బందులనూ తెచ్చిపెడుతోంది. మనుషులను అచేతనంగా చేసే స్థాయి వరకూ తీసుకెళ్తోంది. స్మార్ట్‌ ఫోన్‌కు బానిసై చేతివేళ్లు చచ్చుబడిపోయిన మహిళ కథను చూసొద్దాం పదండి. 

smartphone

ఏ ఇంట వెతికినా…

ప్రస్తుతం ఏ ఇంట వెతికనా… స్మార్ట్‌ ఫోన్‌ పెడుతున్న ఇబ్బందుల జాడలు కనిపిస్తూనే ఉంటాయి. రెయిమ్స్‌కూ, కార్టూన్లకూ అలవాటు పడిపోయిన పసిపిల్లలూ, గేమ్స్‌ వదలకుండా మారాం చేస్తోన్న స్కూల్‌ పిల్లలూ, సోషల్‌ మీడియాలో మునిగితేలుతూ టీనేజర్లూ, బ్రౌజింగ్‌ కాలక్షేపంలో పెద్దలూ… ఇలా అన్ని వయసుల వారినీ స్మార్ట్‌ఫోన్‌ తనవైపు తిప్పుకుంది. తనకు బానిసలుగా చేసుకుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులను తీసుకొస్తుందని…  మానసిక వైద్య నిపుణులు అదే పనిగా హెచ్చరిస్తున్నారు. 

smartphone

చచ్చుబడిపోయాయి… 

ఈ అమ్మాయి కథ… ఎన్నో కథల్లానే మొదలైంది. అన్నింటిలానే నడిచింది. కానీ మధ్యలో మాత్రం ఊహించని మలుపు తారసపడి, ఆ తర్వాత జీవితాన్ని అయోమయంలో పడేసింది. ఆమె చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో నివాసముంటుంది. స్మార్ట్‌ఫోన్‌కు బాగా అలవాటు పడింది. కాసేపు కూడా ఫోన్‌ పక్కన పెట్టకుండా, మేల్కున్నంత సేపూ… స్మార్ట్‌ఫోన్‌ తెరపై వేళ్లని ఆడిస్తూనే ఉంది. దీంతో చేతులు విపరీతంగా నొప్పెట్టాయి. ఆ తర్వాత వేళ్లన్నీ వంగిపోయి, బిగిసుకుపోయాయి. ఎంతసేపటికీ అవి సాధారణ స్థితికి రాలేదు. మరుసటి రోజుకు మరికాస్త వంకరతిరిగాయి. కుటుంబసభ్యుల కంగారు పడిపోయారు. బాధిత మహిళను ఆస్పత్రికి చేర్చారు. డాక్టర్లు మెరుగైన చికిత్స అందించి, ఫిజియోథెరిపిస్టులు వైద్యం అందించడంతో వేళ్లు మామూలు స్థితికి వచ్చాయి. సో..స్మార్ట్ పోన్లు వాడేవారు కాస్త జాగ్రత్త అండీ.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *