మ్యూజిక్‌తో దోమలకు చెక్‌

మ్యూజిక్‌తో దోమలకు చెక్‌

దోమల సంహరణకు ఎన్నో విధానాలున్నా మ్యూజిక్‌ థెరపీ సరైన మార్గామా? సంగీతంతో వాటి జనాభాను ఆరికట్టవచ్చా? రక్తం పీల్చే దోమల ఉనికిని దెబ్బతీయొచ్చా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిశోధనలు..

దోమలు..చూడ్డానికి చిన్నవే కానీ దాని కాటు మాత్రం జనాన్ని వణికిస్తోంది..మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్య, మెదడువాపు, పైలేరియా ఇలా ఎన్నో వ్యాధులకు దోమలే కారణమవుతున్నాయి. అంతేకాదు ప్రపంచంలో సంభవించే మరణాలకు మూలకారణాల్లో దోమలదే మొదటి స్థానంగా తేల్చింది WHO. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యూజిషీయన్‌ స్క్రిలెక్స్ మాత్రం..మ్యూజిక్‌తో దోమలకు చెక్‌ పెడతానని ముందుకొచ్చాడు.

దోమలతో ప్రబలే వ్యాధులపై లోతుగా అధ్యయనం చేస్తున్న రీసెర్చర్లు..ఎల్లో ఫీవర్‌కి కారణమైన ప్రత్యేక దోమల జాతిపై దృష్టిపెట్టారు. మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా దోమల వ్యాప్తిని అడ్డుకోవచ్చని వారి పరిశోధనల్లో తేలింది. దోమల ప్రత్యుత్పత్తి సమయంలో శబ్దమే కీలకమట. కొన్ని దోమలు లైంగిక చర్యను ప్రారంభించేముందు తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన సంగీతం తప్పనిసరట. భారీ శబ్దాలు, హై ఫ్రీక్వెన్సీ శబ్దాలు విన్నప్పుడు..కీటకాల్లో లైంగిక వాంఛ తగ్గిపోతుందని..ఆడ-మగ దోమల మధ్య దూరం పెరుగుతుందని తెలుసుకున్నారు.

మరోవైపు అమెరికన్ మ్యుజీషియన్ స్క్రిలెక్స్ క్రియేట్‌ చేసిన నైస్‌ స్ప్రైట్స్‌, స్కారీ మన్‌స్టర్స్‌ ట్యూన్స్ పరిశోధకులను ముందుకు నడిపించాయి. భిన్నమైన ఫ్రీక్వెన్సీలతో కూడిన ఈ రెండు బీట్లను దోమలపై ప్రయోగించి..వాటిలో కలిగే లైంగిక ప్రేరణల్ని లెక్క గట్టారు. ధ్రువ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ప్రాణాంతకమైన ఏడెస్‌ ఈజిప్టి జాతి దోమలు..ఈ సంగీతానికి ఎక్కువగా ప్రభావితమైనట్లు గుర్తించారు. ఈ దోమలు మనుషుల నుంచి రక్తం పీల్చే విధానాన్ని కూడా అదుపులో పెడుతున్నట్లు గ్రహించారట. డెంగీ, జికా వైరస్, ఎల్లో ఫీవర్ లాంటి భీకరమైన వ్యాధులకు కారణమయ్యే ప్రమాదకరమైన దోమలను పూర్తిగా నిర్మూలించలేకపోయినా..కనీసం వాటి జనాభను మ్యూజిక్‌తో నియంత్రించవచ్చని చెబుతున్నారు రీసెర్చర్లు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *