ఇద్దరు బిడ్డలని అప్పగించాల్సిందే..

ఇద్దరు బిడ్డలని అప్పగించాల్సిందే..

సింధూశర్మ పోరాటం చివరికి ఫలించింది. ఆమె చిన్నపాపను రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కుటుంబం ఆమెకు అప్పగించింది. అయితే పెద్ద పాపను కూడా తనకు అప్పగించాలని సింధూ డిమాండ్ చేస్తున్నా, రామ్మోహన్ కుటుంబం అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. పెద్ద పాపను చూడటానికి నూతి కుటుంబం నిరాకరిస్తున్నారని, చివరికి పెద్ద పాపను తనకు ఒకే ఒక నిమిషం చూపించి తీసేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్‌రావు కుటుంబంపై కోడలు సింధూ శర్మ పోరాటానికి దిగారు. ఆదివారం ఏకంగా ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. తన ఇద్దరు కుమార్తెలను తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఆమె ధర్నా చేయడంతో వెంటనే మహిళా సంఘాలు కూడా సింధూ శర్మకు మద్దతు పలికాయి. ఓ వైపు పోలీసులు కేసును విచారిస్తుండగా, మరోవైపు చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. ఇద్దరు పసిబిడ్డలను తల్లికి అప్పగించాలని సూచించింది. ఈ క్రమంలో చిన్న కుమార్తె శ్రీవిద్యను తల్లి సింధూశర్మకు అప్పగించారు.

మరోవైపు రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు.. తొలుత ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు. చైల్డ్ లైన్ ప్రతినిధులు రాగానే సింధూ శర్మను లోపలికి అనుమతించారు. సింధూ శర్మ పోరాటం, మహిళ సంఘాలు, చైల్డ్ లైన్ ప్రతినిధులు అండగా నిలవడంతో.. రామ్మోహన్ రావు కుటుంబం దిగొచ్చింది. సింధూ శర్మకు చిన్న కూతురిని అప్పగించారు. పాప తల్లి ఒడికి చేరింది. పెద్ద పాపను కూడా తనకు అప్పగించాలని సింధూ శర్మ డిమాండ్ చేశారు. చిన్నపాపను అప్పగించగా.. పెద్ద పాప విషయమై సోమవారం చైల్డ్ లైన్ ప్రతినిధులతో చర్చించాలని రామ్మోహన్ రావు కుటుంబానికి సూచించారు.

మరోవైపు నేడు భరోసా సెంటర్‌లో పెద్ద కుమార్తెను కూడా అప్పగించే అవకాశం ఉందని సింధు అంటున్నారు. విడాకులు తీసుకోవాలని జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు తనకు సూచించారని.. వారిపై తాను వేసిన కేసులు ముందు రుజువవ్వాలని.. అప్పటి వరకూ విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు.

ఏదిఏమైనా జస్టిస్ నూతి రామ్మోహన్ కోడలు సింధూ శర్మ చేస్తున్న పోరాటంలో చివరికి విజయం సాధించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *