రేపు ఢిల్లీలో ఆవిష్కృతం కానున్న అద్భుతం

రేపు ఢిల్లీలో ఆవిష్కృతం కానున్న అద్భుతం

ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు 14 ఏళ్ల కిత్రం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. యమునా నదిపై నిర్మితమైన ఈ ఐకానిక్‌ బ్రిడ్జిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రారంభించనున్నారు.

cable bridge in delhi

రేపు ప్రారంభంకానున్న సిగ్నేచ‌ర్‌ బ్రిడ్జీ

భారత్‌లో మొట్టమొదటి అసిమ్మెట్రికల్‌ కేబుల్‌ స్టేయిడ్‌ బ్రిడ్జిగా ఈ వంతెన గుర్తింపు పొందింది. ఈ నెల 5 నుంచి ఈ బ్రిడ్జి ప్రజా వినియోగంలోకి రానుంది. 575 మీటర్ల పొడవు, 35.2 మీటర్ల వెడల్పు కలిగి ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల వజీరాబాద్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సులభతరంగా మారనుంది. ఈ కేబుల్‌ బ్రిడ్జీకి సుమారు 1575 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచారం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *