లవ్‌ ఫెల్యూర్ కావడంతో... మళ్లీ సినిమాలను లైన్లో పెట్టిన శృతి హాసన్

లవ్‌ ఫెల్యూర్ కావడంతో... మళ్లీ సినిమాలను లైన్లో పెట్టిన శృతి హాసన్

ప్రేమలో పడ్డవాళ్లకు ప్రేమ తప్ప మరేది అవసరం లేదనిపిస్తోంది.. ఒకసారిగా ఆ ప్రేమకు పుల్‌స్టాప్‌ పడితే కెరీర్‌ గుర్తుకు వచ్చి తెగ బాధ పడుతుంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్‌ కూడా లవ్‌ ఫెల్యూర్ కావడంతో కెరీర్‌ గురించి తెగ ఫిల్ అవుతుందట. ఇక నుంచి కెరీరే ముఖ్యం అంటుంది. ఈ క్రమంలో క్రేజీ ఛాన్స్‌లు అందుకుందని తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ ఎవరో చూద్దాం…

స్టార్ హీరో డాటర్‌గా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శృతి హాసన్.అయితే కమల్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి సొంత టాలెంట్‌తో హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది.అయితే సౌత్ ఇండస్ట్రీలో మూడేళ్ళు టాప్ హీరోయిన్ గా కొనసాగిన శృతికి, ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గాయి. ముందు ఉన్నట్టుగా ఇప్పుడు సినిమాలు లేవు. అందుకు కారణం శృతి హాస‌న్ కొన్నాళ్ళ‌పాటు మైఖేల్ కోర్సెల్‌ డిప్ లవ్‌లో ఉండి కెరీర్‌ని పట్టించుకోవడం మానేసింది. అయితే ఏవో కారణాలతో ఈ ఇద్దరి ప్రేమ‌కి బ్రేక్ ప‌డింది.దీంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తుంది శృతి.

రెండేళ్ళ‌పాటు సినిమాల‌కి దూరంగా ఉన్న శృతి హాస‌న్ విజ‌య్ సేతుప‌తి ఓ సినిమాలో నటించబోతుంది. తెలుగులో కొర‌టాల శివ‌, చిరంజీవి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో శృతి హాస‌న్ హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట.. ఇక గోపిచంద్ మలినేని,రవి తేజ కాంబినేషన్ లో రానున్న ఓ మూవీ లో శృతి హీరోయిన్‌గా ఫైనల్ చేశారు.మరి ఈ సినిమాలు ఈ బ్యూటీ కెరీర్‌కు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *