‘పడి పడి లేచె మనసు’ మూవీ రివ్యూ

‘పడి పడి లేచె మనసు’ మూవీ రివ్యూ

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న  శర్వానంద్, యాక్టింగ్‌తో టాలీవుడ్  జనాలను ఫిదా చేస్తున్న సాయిపల్లవి జంటగా , డిఫరెంట్ లవ్  మూవీస్ దర్శకుడు హను రాఘవపూడి  కలయికలో వచ్చిన సినిమా పడి పడిలేచే మనసు.. టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి సాంగ్స్‌ , టీజర్స్, పోస్టర్స్‌ వరకు కొత్తగా  చూపిస్తు  సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్  చేశాడు దర్శకుడు.

కలకత్తాలో సెటిల్…

ఈ సినిమా కథ విషయానికి వస్తే. హీరో ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. హీరోయిన్ డాక్టర్. ఈ ఇద్దరు ఫ్యామిలిలు కూడా కలకత్తాలో సెటిల్ అయిన తెలుగు కుంటుంబాలు. దూరం చూసి  హీరోయిన్‌ని ప్రేమిస్తాడు హీరో… హీరోయిన్‌ కూడా  హీరోని ప్రేమిస్తుంది. కానీ కొన్ని రిజన్స్ వల్ల  పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడాడు హీరో . దీంతో ఇద్దరు విడిపోతారు. ఆ తరువాత  మళ్లీ ఎలా కలిశారు. పెళ్లి చేసుకున్నారా లేదా అనేదే మిగత స్టోరీ.

మెస్మరైజ్ చేశాడు…

శర్వానంద్ ఎలాంటి పాత్ర ఇచ్చిన ఆ పాత్రలో ఇమిడిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా తన మెచ్యూర్డ్ పర్ఫామెన్స్‌తో  మెస్మరైజ్  చేశాడు. ఇక రోమాంటిక్ , లవ్  సీన్స్‌తో పాటు  మంచి కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక  పాత్రకు ఇంపార్టెంట్  ఉండే పాత్రలు మాత్రమే చేసే సాయిపల్లవి తన పాత్రకు తగ్గట్టు పర్పామెన్స్‌తో మరోసారి ఆడియన్స్‌ని ఫిదా చేసింది.అయితే ఈ మూవీ ఎక్కువగా హీరో, హీరోయిన్ చుట్టే తిరగడంతో, ఈ ఇద్దరి మెస్మరైజింగ్ యాక్టింగ్‌కు సినిమాకు ప్ల‌స్ పాయింట్ అని చెప్పోచ్చు. ఇక మిగత నటి నటులు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

Padi Padi Leche Manasu Review

కాస్త తికమక…

దర్శకుడు హను రాఘవపూడి తన స్టైల్ ఆప్ పొయటిక్ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే కథ , కథనంలో కాస్త స్లోగా ఉన్నప్పటికి హీరో, హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్, కామెడి, విజువల్స్, సాంగ్స్‌తో ఫస్ట్ హాప్‌ని  ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగేలా చేశాడు. కానీ ఇంటర్వెల్‌కు వచ్చేసరికి కాస్త  తికమకపడ్డాడు.

అయితే ఫస్ట్ హాఫ్ ని  ఎంగేజింగ్‌గా తెరకెక్కించి దర్శకుడు సెకండ్ హాప్ మాత్రం  రొటీన్ సీన్స్ తో  ప్రేక్షకులు బోర్‌గా  ఫీల్ అయ్యేలా చేశాడు. 

Padi Padi Leche Manasu Review

యూత్‌ని మాత్రమే…

ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్లు శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి  యాక్టింగ్ పాటు, పాటలు, నేపథ్య సంగీతం  కట్టిపడేస్తుంది. సినీమాటోగ్రాఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇక మైన‌స్ పాయింట్ల విషయానికి వస్తే  కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు, ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే సీన్స్ లేకపోవడం.  యూత్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్న వచ్చిన ఈ సినిమా యావరేజ్  హిట్‌గా నిలుస్తోందిన చెప్పోచ్చు. ఒక విషయంలో ఈమూవీ గురించి చెప్పాలంటే యూత్‌ని మాత్రమే నచ్చే చిత్రం. 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *