శైలజా రెడ్డి అల్లుడు మూవీ రివ్యూ

శైలజా రెడ్డి అల్లుడు మూవీ రివ్యూ

పాత ఫార్ములాకి కొత్త రంగులు అద్దిన మారుతీ

shailaja reddy alludu review

మతిమరుపు, జాలి, ఓసీడి… ఈ పేర్లు వినగానే మారుతీ సినిమాల్లోనే హీరో క్యారెక్టర్లు గుర్తొస్తాయి… గత కొంత కాలంగా హీరోకి ఎదో ఒక లోపం పెడుతూ, దాని నుంచి వచ్చే ఫన్ తో సినిమాని నడిపించి హిట్ కొడుతున్న మారుతీ… ఈసారి అక్కినేని నాగ చైతన్యతో కలిసి శైలజా రెడ్డి అల్లుడు అంటూ ప్రేక్షకులని పలకరించాడు.. అయితే ఎప్పుడు హీరోలకి లోపం పెట్టె మారుతీ ఈసారి హీరోయిన్, ఆమెతో ఆమె తల్లికి, హీరో తండ్రికి కూడా ఒక లోపం పెట్టాడు… అదే ఇగో. మరి egoistic లవర్, అత్త మధ్య నలిగిన చై.. వినాయక చవితిన ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.. ఈ సినిమా కథా కథనాల విషయానికి వస్తే, ఒకప్పుడు తెలుగు సినిమాని ఒక ఊపు ఊపిన పక్కా కమర్షియాల్ ఫార్మాట్ అయినా అత్త ఫార్ములాని మళ్ళీ తెరపై చూపించారు.. ఇగో ఎక్కువ ఉన్న రావు కొడుకు అయిన చైతన్య, తన కాలనీకి కొత్తగా వచ్చిన అను అనే ఇగో ఉన్న అమ్మాయిని, ఒక ప్లాన్ ప్రకారం ప్రేమలో పడేస్తాడు. అనుకి కూడా తనలాగే ఇగో ఎక్కువ అని తెలుసుకున్న, రావు.. చైతన్య, అనుల పెళ్ళికి ఒప్పుకొని, అనుకోని పరిస్థితిలో అనుకి చైతన్యకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది, అయితే అను వరంగల్ ని శాశిస్తున్న శైలజా రెడ్డి కూతురు అని తెలుస్తుంది. తనకి తెలియకుండా ఏది జరిగినా ఒప్పుకొని శైలజా రెడ్డి, కూతురు నిశ్చితార్దాన్ని ఒప్పుకుంటుందా? అను చైతన్యల పెళ్లి జరగనిస్తుందా? ఇగో కి పరాకాష్ట అయిన లవర్, అత్తాల మధ్య చైతన్య ఎలా నలిగిపోయాడు, చివరికి తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అనేదే శైలజా రెడ్డి అల్లుడు కథా కథనం… ఒకప్పటి హిట్ ఫార్ములాకి మారుతీ మార్క్ ని జోడించి తీసిన ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్…

ర‌మ్య‌కృష్ణ న‌ట‌న అంద‌రిని అల‌రిస్తుంది…

shailaja reddy alludu review

నటీనటుల విషయానికి వస్తే, శివగామిగా ప్రేక్షకులని మెప్పించిన రమ్యకృష్ణ, మరోసారి egoistic పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులని పలకరించింది.. తన ఎంట్రీ సెకండ్ హాఫ్ లో అయినా కూడా శైలజా రెడ్డి అల్లుడు సినిమాకి రమ్యకృష్ణ ప్రధాన బలమనే చెప్పాలి… ఎన్నో మంచి పాత్రలు చేసిన రమ్యకృష్ణ కెరీర్ లో శైలజా రెడ్డి పాత్ర కూడా నిలిచిపోతుంది. తల్లికి తగ్గ కూతురుగా కనిపించిన అను ఇమ్మానుయేల్ కూడా నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించింది. రమ్య కృష్ణతో పాటు నటించే సీన్స్ లో తేలిపోయినా కూడా తన పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది… రెండవ భాగం రమ్యకృష్ణ నడిపిస్తే మొదటి భాగంలో ఆ పనిని మురళి శర్మ చేశారు, తన నటనతో ఎలాంటి పాత్ర అయినా చేయగలడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.  ఇక చైతన్యగా కనిపించిన చై, సినిమాని ముందుండి నడిపించాడనే చెప్పాలి, పక్కా కమర్షియల్ సినిమాలో ఫైట్స్, డాన్స్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు… శైలజా రెడ్డి అల్లుడితో చై నటుడిగా మరో మెట్టు ఎక్కాడు, తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. లవర్, అత్త మధ్య నలిగిపోయే సీన్స్ లో చాలా బాగా నటించాడు.  మిగిలిన పాత్రల్లో కనిపించిన నరేష్, పృథ్వి లాంటి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు, బాగా నవ్వించారు.

shailaja reddy alludu review

శైలజా రెడ్డి అల్లుడు పూర్తిగా డైరెక్టర్ మారుతీ సినిమా అనే చెప్పుకోవాలి, పాత హిట్ ఫార్మాట్ కి, తన ప్రధాన బలమైన కామెడీని జోడించి ఈ సినిమాని కుటుంబమంతా కలిసి కూర్చొని చూసే మంచి చిత్రంగా మలిచాడు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి, మొదటి భాగంలో వచ్చే లవ్ ట్రాక్ కొంచెం తగ్గించి ఉంటే మరింత బాగుండేది.. మొత్తానికి కొత్తగా ఏమి కనిపించకపోయినా కూడా కుటుంబమంతా కలిసి కూర్చొని హాయిగా నవ్వుకునే సినిమా ఈ శైలజా రెడ్డి అల్లుడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *