టాలీవుడ్‌ డైరెక్టర్‌కి ఓకే చెప్పిన షారూక్‌ఖాన్‌

టాలీవుడ్‌ డైరెక్టర్‌కి ఓకే చెప్పిన షారూక్‌ఖాన్‌

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌కు కొద్ది రోజులుగా కాలం కలిసి రావటం లేదు. ఈ హీరో సాలిడ్‌ హిట్ అందుకొని చాలా రోజులే అవుతుంది. ఖాన్ త్రయంలో అమీర్‌, సల్మాన్ వరస సక్సెస్‌లతో దూసుకుపోతుంటే షారుఖ్ మాత్రం హిట్ రేసులో వెనుకబడిపోయాడు. ఇప్పుడు ఈ హీరో టాలీవుడ్ దర్శకుడి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని సమాచారం.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌ హిట్ అనే పదం విని చాలా రోజులే అవుతుంది. తనతోటి హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సక్సెస్ మీద సక్సెస్‌లు అందుకుంటుంటే షారుఖ్‌ ఖాన్‌కు మాత్రం సక్సెస్ అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఎన్నో ఆశలతో స్వయంగా నటించి నిర్మించిన జీరో కూడా బోల్తా పడటంతో కింగ్‌ ఖాన్‌ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే అంగీకరించిన రాకేష్‌ శర్మ బయోపిక్‌ సారే జహాసే అచ్చాను కూడా పక్కనపెట్టేశాడు.ఇలాంటి పరిస్థితిల్లో షారూఖ్‌ ఓ తెలుగు దర్శకుడితో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడని తెలుస్తోంది..

అనగనగా ఓ ధీరుడు, సైజ్‌ జీరో లాంటి వెరైటి సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రకాస్ కొవెలముడికి సక్సెస్‌ సాధించలేకపోయినా దర్శకుడిగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రకాష్‌ బాలీవుడ్‌లో కంగనా, రాజ్‌ కుమార్‌ రావులతో మెంటల్‌ హై క్యా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మానసిక వికలాంగుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్‌ అతిథి పాత్రలో నటించనున్నాడట. కథకు కీలకం కావటంతో పాటు పవర్‌ఫుల్‌ రోల్‌ కావటంతో షారూఖ్‌ కూడా ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మెంటల్‌ హై క్యా టైటిల్‌పై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. టైటిల్ మానసిక విగలాంగులను అవమానించినట్టుగా ఉందన్న వాదన వినిపిస్తోంది. మరి అసలే సక్సెస్‌ లేని పరిస్థితుల్లో ఇలాంటి వివాదాస్పద చిత్రంలో షారూఖ్‌ నటిస్తాడా.? లేదా అనేది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *