ట్రైనింగ్ పేరుతో యువతులపై లైంగికదాడులు

ట్రైనింగ్ పేరుతో యువతులపై  లైంగికదాడులు

తెర పై తమను తాము చూసుకోవాలని చాలా మంది తపిస్తుంటారు..సినిమా, టీవిల్లో రాణించాలని..అందుకు తగిన విధంగా నటనలో శిక్షణ పొందాలని ఎంతో మంది ఔత్సాహిక నటులు వేలు, లక్షలు దారపోసి ట్రైనింగ్ తీసుకుంటారు. అయితే కొన్ని ఫేక్ ఇనిస్ట్రిట్యూట్స్ ఇలాంటి వారిని దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. ఇటీవల నటనలో శిక్షణ పేరుతో యువతులకు వేధింపులు చేస్తున్న ఓ ప్రబుద్దుడి గుట్టు బయట పడింది. బట్టలు విప్పి నటన నేర్చుకుంటే అద్భుతంగా రాణిస్తారంటూ కొత్త భాష్యం చెప్పాడు ఓ కీచక గురువు.. అ కథా కమామీషు ఏంటో మీరూ చూసేయండి..

వినయ్ వర్మ… సినిమాలు చూసేవాళ్లకి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ సినిమాల్లో నటించాలని ఆరాటపడేవాళ్లకు మాత్రం కచ్ఛితంగా తెలిసే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ సంపాదించిన వినయ్ వర్మ… హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఓ యాక్టింగ్ స్కూల్‌ కూడా పెట్టుకున్నాడు. సినిమాల్లోకి రావాలనుకునేవారికి ట్రైనింగ్ ఇచ్చే ఈ యాక్టింగ్ గురు… ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తన దగ్గరకు నటన నేర్చుకోవడానికి వచ్చిన యువతులను నగ్నంగా నిల్చుంటే గానీ… శిక్షణ ఇవ్వనని వేధించడమే ఇందుకు కారణం.

హైదరాబాద్‌ లోని హిమాయత్‌నగర్‌లో ‘సూత్రధార’ పేరుతో ఓ వర్క్ షాప్ స్థాపించాడు వినయ్ వర్మ. ఈ స్కూల్‌కు వచ్చిన యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నాడు. తన కోచింగ్‌ సెంటర్‌కు యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చిన యువతుల దగ్గర్నుంచి వేలల్లో ఫీజు వసూలు చేసే వినయ్ వర్మ… ట్రైనింగ్ పేరుతో వారిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. నగ్నంగా నిలబడితేనే కోచింగ్ ఇస్తానని చెప్పి, తనను ఓ గదిలో బంధించి వేధించాడంటూ ఓ యువతి… పోలీసులను ఆశ్రయించింది.

అయితే వినయ్ వర్మ మాత్రం తాను చెప్పినట్టు బట్టలు విప్పి, సిగ్గు బిడియం పక్కనబెట్టి యాక్టింగ్ నేర్చుకుంటే సినిమాల్లో అద్భుతంగా రాణిస్తారని చెబుతుండడం కొసమెరుపు. గతంలో చాలామంది ఇలాగే యాక్టింగ్ నేర్చుకున్నారని, వారు ఇప్పుడు ఉన్నతస్థానాల్లో ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. మహిళా సంఘాలు మాత్రం వినయ్ వర్మను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సినిమాల్లో అవకాశాల కోసం బట్టలు విప్పిస్తారని తెలుసు కానీ యాక్టింగ్ నేర్చుకోవడానికి కూడా బట్టలు విప్పాల్సి వస్తుందని తెలిసి… సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు సినీ ఫ్యాన్స్.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *